iDreamPost

Sukumar Movies : పుష్ప తర్వాత 2 కమిట్మెంట్లు

Sukumar Movies : పుష్ప తర్వాత 2 కమిట్మెంట్లు

పుష్ప ది రైజ్ పార్ట్ 1 తర్వాత దర్శకుడు సుకుమార్ నెల గ్యాప్ తీసుకుని ఫిబ్రవరి నుంచి పార్ట్ 2 ది రూల్ మొదలుపెట్టబోతున్నారు. కలెక్షన్లు బాగానే వచ్చినప్పటికీ పుష్ప ఆశించిన రేంజ్ లో వెళ్లలేదన్నది వాస్తవం. వీకెండ్ తర్వాత చాలా ప్రాంతాల్లో నెమ్మదించింది. అఖండ తరహాలో కంటిన్యూ ఫ్లోస్ కనిపించడం లేదు. క్రిస్మస్ వీకెండ్ కాబట్టి వసూళ్లు మళ్ళీ పెరుగుతాయనే ధీమా ట్రేడ్ లో ఉంది. అది కూడా శ్యామ్ సింగ రాయ్, 83 టాక్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక పుష్ప 2 కి బాహుబలి రేంజ్ లో అంచనాలేమీ ఇంకా మొదలు కాలేదు. ఫస్ట్ పార్ట్ కు వచ్చే స్పందనను బట్టి సీక్వెల్ కు కావాల్సిన మార్పులు చేసుకుంటామని సుకుమార్ గతంలోనే చెప్పారు.

ఇదిలా ఉండగా ఈ పుష్ప సిరీస్ తర్వాత సుకుమార్ చేయబోయే సినిమాలు ఏవో కన్ఫర్మ్ అయ్యాయి. మొదటిది విజయ్ దేవరకొండతో. ఇది ఎప్పుడో ఇచ్చిన కమిట్ మెంట్. ఎన్నో నెలల క్రితం ప్రకటన కూడా వచ్చింది. కాకపోతే లైగర్ కు జరిగిన విపరీతమైన ఆలస్యం వల్ల రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లలేకపోయింది. పుష్ప 2 అవ్వగానే ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసి సెట్స్ పైకి తీసుకెళ్తారు. ఆ తర్వాత రామ్ చరణ్ తో ఉంటుంది. చరణ్ ప్రస్తుతం ఆచార్య, ఆర్ఆర్ఆర్ లు పూర్తి చేసి శంకర్ ప్రాజెక్ట్ కు చిన్న గ్యాప్ ఇచ్చాడు. అది కాగానే గౌతమ్ తిన్ననూరి సినిమా మొదలువుతుంది. నెక్స్ట్ ప్రశాంత్ నీలా లేక సుకుమారా అనేది అప్పటి పరిస్థితులని బట్టి ఆధారపడి ఉంటుంది.

రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తో తనలో రియల్ ఆర్టిస్ట్ ని బయటికి తీసుకొచ్చిన సుకుమార్ అంటే చరణ్ కు చాలా గౌరవం. దాని టైపులోనే మళ్ళీ విలేజ్ బ్యాక్ డ్రాప్ తీసుకుంటారా లేక కొత్త నేపధ్యం ఉంటుందా అనేది వేచి చూడాలి. సుకుమార్ ఇటీవలి కాలంలో రా డ్రామాలనే ఇష్టపడుతున్నారు. స్టైలిష్ అర్బన్ కథల కన్నా ఇలాంటి వాటికే కమర్షియల్ వాలిడిటీ ఎక్కువగా ఉండటంతో దానికి తగ్గట్టే రాసుకుంటున్నారు. మరి విజయ్ దేవరకొండకు ఎలాంటి లైన్ సిద్ధం చేశారో చూడాలి. పుష్ప 2 కోసం ఎంతలేదన్నా ఆరేడునెలలు బిజీ అవుతారు సుక్కు. ఆ తర్వాత పైన రెండు సినిమాలు అంటే 2024 దాకా సుకుమార్ డైరీ బిజీనే

Also Read : Love Story Television TRP : లవ్ స్టోరీ హిట్టు – శ్రీదేవి ఫట్టు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి