iDreamPost

ఆడియో రైట్సే అన్ని కోట్లా? పుష్పరాజ్ లెక్కలు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి!

Pushpa 2 Audio Rights For Record Price: అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప-2 మూవీకి సంబంధించి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. పుష్ప రూల్ ఆడియో రైట్స్ కి సంబంధించి కళ్లు చెదిరే మొత్తం అందినట్లు చెప్తున్నారు. ఆడియో రైట్స్ కే అన్ని కోట్లా అని అంతా నోరెళ్ల బెడుతున్నారు.

Pushpa 2 Audio Rights For Record Price: అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప-2 మూవీకి సంబంధించి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. పుష్ప రూల్ ఆడియో రైట్స్ కి సంబంధించి కళ్లు చెదిరే మొత్తం అందినట్లు చెప్తున్నారు. ఆడియో రైట్స్ కే అన్ని కోట్లా అని అంతా నోరెళ్ల బెడుతున్నారు.

ఆడియో రైట్సే అన్ని కోట్లా? పుష్పరాజ్ లెక్కలు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి!

ఇది పుష్పగాడి రూలు.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో పుష్ప 2 మూవీ క్రేజ్, ఆ మూవీకి సంబంధించి వస్తున్న వార్తలు చూస్తే అదే డైలాగ్ గుర్తొస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా లెవల్లో పుష్ప సినిమాతో సుకుమార్, అల్లు అర్జున్ క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. ఈ మూవీ సీక్వెల్ కోసం ఇంతలా ఎదురు చూస్తున్నారు అంటేనే పుష్పరాజ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటో అర్థమవుతుంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ చూసిన తర్వాత ఆ అంచనాలు మరో స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు వాటిని రెండింతలు చేసే వార్త ఒకటి వైరల్ అవుతోంది. అది పుష్ప 2 సినిమా ఆడియో రైట్స్ కి సంబంధించిన విషయం.

పుష్ప సినిమాతో పోలిస్తే పుష్ప 2 మూవీ అన్ని విషయాల్లో నెక్ట్స్ లెవల్ కి చేరుకుంది. బడ్జెట్ కావచ్చు, కథ కావచ్చు, క్యారెక్టర్స్, బిజినెస్ అన్నీ మరో స్థాయికి చేరుకున్నాయి. అయితే అంచనాలు కూడా అలాగే పెరిగిపోయాయి. వాటిని అందుకునేలా మూవీ ఉంటుందా అనే అనుమానాలు అయితే అభిమానుల్లో ఉండేవి. కానీ, టీజర్ చూసిన తర్వాత మూవీ ఎంత రిచ్ గా, ఎంత అద్భుతంగా ఉండబోతోందో అర్థమైంది. యాక్షన్, ఎలివేషన్ విషయంలో పుష్పగాడి రూలు ఏమాత్రం తగ్గదని అర్థమైంది. అలాగే వాటికి తగ్గట్లుగానే పుష్ప 2 బిజినెస్ కూడా జరుగుతోంది. అందుకు సంబంధించిన ఒక గాసిప్ ప్రస్తుతం పాన్ ఇడియా లెవల్లో చక్కర్లు కొడుతోంది. అలాగే ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునేలా చేస్తోంది.

విషయం ఏంటంటే.. ఇప్పుడు పుష్ప 2 మూవీ ఆడియో రైట్స్ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. పుష్ప 2 మూవీ అన్ని భాషలో ఆడియో రైట్స్ ని టీ- సిరీస్ కొనుగోలు చేసిందంట. అది కూడా ఏకంగా రూ.60 కోట్లకు కొన్నట్లు చెప్తున్నారు. ఇది నిజమో అబద్ధమో పక్కన పెడితే.. ఆడియో రైట్స్ నే రూ.60 కోట్లకు అమ్మారంటున్నారు. అలాంటప్పుడు శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ రైట్స్ ని ఎంతకు అమ్ముతారు? అసలు ఆ డిమాండ్ ఏంటి అంటూ ట్రేడ్ పండితులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఆడియో రైట్స్ రూ.60 కోట్లకు అమ్ముడైన విషయం నిజమైతే.. ఇంక ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఎన్ని వందల కోట్లకు అమ్ముతారంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇదంతా పుష్ప 2 సినిమాపై ఉన్న హైప్, సుకుమార్- అల్లు అర్జున్- దేవిశ్రీ ప్రసాద్ పై ఉన్న నమ్మకం అనే చెప్పాలి. అలాగే బాలీవుడ్ లో కూడా పుష్ప 2 రూల్ కి ఏమాత్రం అడ్డంకులు ఉండవనే చెప్పాలి. ఎందుంకటే ఆగస్ట్ 15కి సింగం సినిమా వస్తే థియేటర్ల విషయంలో, ఆక్యుపెన్సీ విషయంలో కాస్త ఇబ్బంది కలుగుతుందని భావించారు. కానీ, సింగం మూవీ టీమ్ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మూవీకి ఇంకా చాలా పనులు పెండింగ్ ఉండటంతో.. దీపావళికి రావాలని భావిస్తున్నట్లు బీటౌన్ లో వార్తలు వస్తున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. కొన్ని రోజుల్లో ప్రకటన వస్తుంది అంటున్నారు. అలాగైతే నార్త్ లో కూడా పుష్ప 2 మూవీకి అడ్డంకులు తొలగినట్లే. మరి.. పుష్ప 2 ఆడియో రైట్స్ రూ.60 కోట్లకు అమ్ముడయ్యాయి అని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి