iDreamPost

ప్రయోగాలు సరే.. ఫలితాలు కూడా చూసుకోవాలిగా!

  • Author ajaykrishna Updated - 02:44 PM, Mon - 9 October 23
  • Author ajaykrishna Updated - 02:44 PM, Mon - 9 October 23
ప్రయోగాలు సరే.. ఫలితాలు కూడా చూసుకోవాలిగా!

టాలీవుడ్ లో దాదాపు పదేళ్లుగా హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు సుధీర్ బాబు. సూపర్ స్టార్ కృష్ణకు చిన్నల్లుడుగా, మహేష్ బాబుకు బావగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుధీర్.. తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నాడు. ఆ కష్టం సినిమాలలో కూడా కనిపిస్తుంది. కానీ.. అంత కష్టపడితే ఫలితాలు ఏం అవుతున్నాయి నిరాశే. ఫిట్నెస్ పరంగా సుధీర్ పర్ఫెక్ట్. ఆ విషయంలో ఎప్పుడూ టాప్ లోనే ఉంటాడు. సినిమాల విషయానికి వస్తే.. అందరిలా కాకుండా డిఫరెంట్ కథలు చేస్తున్నాడు, కొత్తగా ప్రయోగాలు కూడా చేస్తూనే ఉన్నాడు. అయినా.. ఫలితం సంతృప్తికరంగా ఉండట్లేదు.

కొన్నిసార్లు కథలు వినగానే సూపర్ అనిపిస్తాయి.. తీరా సినిమాగా తెరపైకి వచ్చేటప్పుడు షేప్స్ మారిపోతుంటాయి. సుధీర్ బాబు అలా ఏమైనా కథలు విని ఇంప్రెస్స్ అవుతున్నాడా? అలా ఇంప్రెస్స్ అయిన క్రమంలో కేవలం డైరెక్టర్ ఒక్కడినే నమ్ముతున్నాడా? అనంటే అది చెప్పలేం. కానీ.. ఏ హీరో ఫ్యాన్స్ కైనా పాజిటివ్ రిజల్ట్ కావాలి. ఒక హీరో నుండి ఓ సినిమా వస్తుందంటే.. దానికి బజ్ ఎంత క్రియేట్ అయ్యిందనేది పాయింట్ కాదు. సినిమా హిట్టా ఫట్టా.. ఇవి రెండే మాట్లాడుకుంటారు. సో.. సుధీర్ బాబు సినిమాలు ఎంత వసూల్ చేస్తున్నాయనే విషయం కాకుండా.. ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుంటున్నాయి? అనేది ఆయన కూడా అనలైజ్ చేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు.

ఎందుకంటే.. 2018లో సమ్మోహనం, నన్ను దోచుకుందువటే హిట్స్ తర్వాత ఒక్క హిట్ కోసం సుధీర్ చాలా కష్టపడుతున్నాడు. అవసరం అయితే క్యారెక్టర్ కోసం తనను తాను మార్చుకుంటున్నాడు. శ్రీదేవి సోడా సెంటర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హంట్.. సుధీర్ బాబు లాస్ట్ మూవీస్. మూడింటికి మూడు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. ఇవన్నీ ప్రయోగాలే. ఇవన్నీ పక్కన పెట్టి.. త్రిబుల్ క్యారెక్టర్స్ లో ‘మామా మశ్చింద్ర’ చేశాడు. రీసెంట్ గా రిలీజైన ఆ సినిమా.. డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో రెండు వారాలకే ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుంది. అంటే.. ప్రయోగాలు ఎంతవరకు వర్కౌట్ అవుతున్నాయో ఇక్కడే అర్ధమవుతుంది. మరి సుధీర్ బాబు ఇకనైనా పంథా మార్చి జనాలు మెచ్చే సినిమాలు చేస్తాడని ఫ్యాన్స్ వెయిటింగ్. మరి సుధీర్ బాబు సినిమాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి