iDreamPost

షాకింగ్: సీఎంకు రక్తంతో లేఖ రాసిన విద్యార్థినులు!

షాకింగ్: సీఎంకు రక్తంతో లేఖ రాసిన విద్యార్థినులు!

ముఖ్యమంత్రికి రక్తంతో విద్యార్థినుల లేఖ.. రక్తంతో లెటర్ రాయడం ఏంటని ఆశ్చర్చపోతున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఓ కాలేజీ విద్యార్థినులు అంతా ఏకమై ఏకంగా సీఎంకు రక్తంతో లేక రాసి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఆ విద్యార్థులు ఎందుకు సీఎంకు రక్తంతో లేఖ రాశారు? వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఈ ఘటనలో అలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ లో ఉంటున్న రాజీవ్ పాండే అనే వ్యక్తి ఓ కాలేజీ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నాడు. అయితే ఇతడు ఓ దారుణానికి ఒడిగట్టాడు. అసలు విషయం ఏంటంటే? రాజీవ్ పాండే కాలేజీలోని కొందరు విద్యార్థినులను తన ఆఫీసులోకి పిలుచుకుని వారితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడట. ఇక రాను రాను ఇతని వేధింపులు మరింత ఎక్కువవడంతో వాళ్లు తట్టుకోలేకపోయారు. ప్రిన్సిపాల్ తీరుతో విసుగిపోయిన విద్యార్థినులు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికే లేఖ రాయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల విద్యార్థులు అంతా కలిసి రక్తంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ కు లేఖ రాశారు.

అందులో.. కాలేజీ ప్రిన్సిపాల్ రాజీవ్ పాండే కొన్నాళ్ల నుంచి మాతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు వెంటనే నిందితుడు రాజీవ్ పాండేను అరెస్ట్ చేశారు. అయితే విద్యార్థులకు చదువు చెప్పి తీర్చు దిద్దాల్సిన గురువులే ఇలా తెగించి దారుణాలకు పాల్పడితే భవిష్యత్ పిల్లల పరిస్థితి ఏంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ప్రిన్సిపాల్ తీరుతో విసిగిపోయి సీఎంకు రక్తంతో లేఖ రాసిన విద్యార్థుల నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి