iDreamPost

రాజధాని ఉద్యమం @99 అవుట్!!

రాజధాని ఉద్యమం @99 అవుట్!!

ఇదేదో సచిన్ టెండూల్కర్ సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో 99 వద్ద ఔట్ అయినట్టు వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. అమారావతి రాజధాని సిఆర్డియే ప్రాంతంలో పలు గ్రామాల్లో గత 98 రోజులుగా ఉద్యమ శిబిరాలు ఏర్పాటు చేసి అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో పలు రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అందోళనలు కొనసాగిస్తున్నారు. దీనికి మీడియా తో పాటు ప్రధాన ప్రతిపక్షం మద్దతు ఉండడంతో రాజాధాని ప్రాంత గ్రామాల్లో ఈ అందోళనలు 1వరొజు.. రెండవ రోజు.. యాభైవ రోజు.. అంటూ ఇలా గత 98 రోజులుగా కొనసాగుతున్నాయి.

మొదట ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చెయ్యాలని కొన్ని రాజకీయ పార్టీలు భావించినప్పటికీ మిగతా జిల్లాల్లో స్థానిక ప్రజలనుండి ఎటువంటి మద్దతు లభించక పోవడంతో ఈ రాజధాని ఉద్యమం కేవలం సిఆర్డియే పరిధిలోని గ్రామాలకే పరిమితమయ్యాయి. ఇక్కడ రాజధాని రైతులు చేపట్టిన దర్నాలకు నిత్యం పలు రాజకీయ పక్షాలకు చెందిన నేతలు సందర్శించడం.. ధర్నా చేస్తున్న రైతులకు సంఘీబావం ప్రకటించడం మనకు తెలిసిందే.

ఈ 98 రోజుల దీక్షలో వంటావార్పు.. 72 గంటల దీక్షలు.. మోకాళ్ళ పై నిలబడి దీక్షలు.. జల దీక్షలు.. ఇలా 98 రోజుల పాటు కొనసాగించిన రాజధాని రైతులు 100 వ రోజు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. అయితే కరొనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించినా రాజధాని రైతులు మాత్రం శిభిరాలు ఖాళీ చెయ్యలేదు. అయితే ప్రధాని మోడి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో అమరావతి శిభిరాలను కూడా రైతులు ఖాళీ చెయ్యక తప్పలేదు.

కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అన్నతీరులో మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న అమరావతి జేఏసీ కరొనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో స్వయంగా ఉద్యమాన్ని ఆపేస్తున్నామని ప్రకటించి ఉద్యమ శిభిరాలను ఖాళీ చేసింది. దీంతో అమరావతి ఉద్యమ కారులందరూ తమ ఇళ్లకే పరిమితమవ్వడంతో ఈ ఉధ్యమ శిభిరాలన్నీ వంద రోజులకి కేవలం ఒక్క రోజు దూరంలో 99 వ రోజున ఇలా అర్ధాంతరంగా ఖాళీ అయ్యాయి. మరి తర్వాత పరిణామాలలో ఉద్యమం ఏ రూపు సంతరించుకోనుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి