iDreamPost

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి!

దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై తరుచూ రాళ్ల దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. కొంతమంది ఆకతాయిలు, దుండగులు కావాలనే రాళ్లదాడులు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.

దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై తరుచూ రాళ్ల దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. కొంతమంది ఆకతాయిలు, దుండగులు కావాలనే రాళ్లదాడులు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి!

దేశ వ్యాప్తంగా స్వదేశీ గడ్డపై రూపొందిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ పట్టాలపై పరుగు పెడుతుంది. ఇది 75 ఏళ్ల స్వతంత్ర భారతావనికి ఎంతో గర్వకారణం అంటూ ఉప్పొంగిపోతుంటారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు సెఫ్ జర్నీ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది రైలు. దేశంలో ఇప్పుడు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైల్వే రంగంలో విప్లావాత్మక అడుగు అని చెప్పొచ్చు. ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు అన్ని రకాల సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తుంది వందేభారత్ ఎక్స్ ప్రెస్. అయితే వందేభారత్ ప్రారంభం అయినప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో పలు రకాలుగా ట్రోలింగ్ కి గురి అవుతూనే ఉంది. అంతేకాదు పలుమార్లు రాళ్లదాడికి గురి అవుతుంది. తాజాగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై మరోసారి రాళ్లదాడి జరిగింది. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఒడిశాలో నవంబర్ 26 వ తేదీన గుర్తు తెలియని దుండగుడు రుర్కెలా-భువనేశ్వర్ (20835) వందేభారత్ రైల్ ని లక్షంగా చేసుకొని రాళ్ల దాడికి పాల్పపడినట్లు తెలుస్తుంది. గతంలో పలు రాష్ట్రాల్లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై ఆకతాయిలు, దుండగులు రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. కాకపోతే ఈ దాడుల్లో ప్రయాణికులు ఎలాంటి హానీ జరగలేదు. ఒడిశాలో మరోమారు వందే భారత్ పై రాళ్లదాడి జరగడంపై అధికారులు స్పందించారు. రాష్ట్రంలోని దెంకనత్ – అంగూల్ రైల్వే స్టేషన్ లో మొరమండలి – బుధపాంక్ మధ్య ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ దాడిలో ఎగ్గిక్యూటీవ్ క్లాస్ కోచ్ కిటీకీలు దెబ్బతిన్నాయని అన్నారు. ఈ ఘటనపై విధులు నిర్వహిస్తున్న ఎస్కార్టింగ్ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

సమాచారం అందుకున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ భద్రతా అధికారులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ పోలీసులను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలోనే కటక్ నుంచి ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో నింధితులను గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల దేశంలో రైలు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోయాయి. ఒడిశాలో జరిగిన రైలు ఘటన తల్చుకుంటే ఇప్పటికీ వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఈ ఘటనలో 300 మంది చనిపోగా.. వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దేశ చరిత్రలో మూడు రైళ్ల ప్రమాదం గుర్తుండిపోతుందని అంటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి