iDreamPost
android-app
ios-app

ట్రాక్టర్‌ కొనాలనుకునే రైతులకు SBI గుడ్‌న్యూస్‌.. ఏకంగా 25 లక్షలు

  • Published Jun 10, 2024 | 1:11 PMUpdated Jun 10, 2024 | 1:11 PM

మీరు వ్యవసాయ అవసరాల కోసం ట్రాక్టర్‌ కొనాలనుకుంటున్నారా.. అయితే ఎస్‌బీఐ మీకో అదిరే వార్త చెప్తుంది. ట్రాక్టర్‌ కొనడం కోసం 25 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

మీరు వ్యవసాయ అవసరాల కోసం ట్రాక్టర్‌ కొనాలనుకుంటున్నారా.. అయితే ఎస్‌బీఐ మీకో అదిరే వార్త చెప్తుంది. ట్రాక్టర్‌ కొనడం కోసం 25 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

  • Published Jun 10, 2024 | 1:11 PMUpdated Jun 10, 2024 | 1:11 PM
ట్రాక్టర్‌ కొనాలనుకునే రైతులకు SBI గుడ్‌న్యూస్‌.. ఏకంగా 25 లక్షలు

ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటే కచ్చితంగా ఎడ్లు ఉండాల్సిందే. పొలం దున్నడం దగ్గర  నుంచి.. పండిన పంటను ఇంటికి రవాణా చేసే వరకు అన్ని పనులను ఎద్దుల ద్వారానే పూర్తి చేసుకునే వాళ్లం. కానీ తర్వాత నెమ్మదిగా వీటి స్థానంలోకి ఇతర పనిముట్లు వచ్చి చేరాయి. ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే కచ్చితంగా ట్రాక్టర్‌ ఉండాల్సిందే. పొలం దున్నడం దగ్గర నుంచి పంటను ఇంటికి చేర్చే వరకు ప్రతి పనికి ట్రాక్టర్‌ కావాల్సిందే. గత ఐదారేళ్ల నుంచి గ్రామాల్లో ట్రాక్టర్ల సంఖ్య బాగా పెరిగింది. 5-10 ఎకరాల పొలం ఉ‍న్న వారు ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటు పొలం పనులకు ఉపయోగపడే పనిముట్లు కూడా కొంటున్నారు. మరి మీరు కూడా ట్రాక్టర్‌ కొనాలని భావించి.. డబ్బులు లేక ఆగిపోయారా.. అయితే ఎస్‌బీఐ మీకో శుభవార్త చెప్పింది. మీకు ఏకంగా 25 లక్షలు అందించేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండో అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) రైతుల కోసం అదిరే స్కీమ్‌ తీసుకొచ్చింటి. దీని ద్వారా ట్రాక్టర్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి 25 లక్షల రూపాయల వరకు లోన్‌ అందించనుంది. మోడిఫైడ్‌ న్యూ ట్రాక్టర్‌ లోన్‌ స్కీమ్‌ కింద ఈ రుణం ఇస్తుంది. దీని ద్వారా రైతులు ట్రాక్టర్‌, ఇతర వ్యవసాయ పనిముట్లు, పరికరాలు కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ లోన్‌లో భాగంగా ట్రాక్టర్‌ ఇన్సురెన్స్‌, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు అన్ని కలుపుకుని నగదు ఇస్తారు. ఎస్‌బీఐ అగ్రికల్చర్‌ టర్మ్‌లోన్‌ కింద ఈ సదుపాయం కల్పిస్తోంది. దీని ద్వారా మీరు కనిష్టంగా 2 లక్షల నుంచి గరిష్టంగా 25 లక్షల రూపాయల వరకు లోన్‌ పొందవచ్చు.

6 నెలలకు ఒకసారి ఈఎంఐ..

ట్రాక్టర్‌ కొనుగోలు కోసం లోన్‌ తీసుకున్న వారు ప్రతి నెలా ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు నెలలకు ఒక్కసారి కడితే సరిపోతుంది. అయితే ఈ ట్రాక్టర్‌ లోన్‌ పొందాలంటే.. పొలం పొలం, బంగారం తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. రైతులు ఎవరైనా ఈ ట్రాక్టర్‌ లోన్‌ పొందవచ్చు. ఇందుకు కనీస 2 ఎకరాల పొలం ఉండాలి. సిబిల్‌ స్కోర్‌ 650కి పైనే ఉండాలి. మీకు సమీపంలోని ఎస్‌బీఐ బ్యాంక్‌కు వెళ్లి.. అక్కడ వివరాలు కనుక్కొండి. ఈ లోన్‌ పొందాలంటే.. ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డ్‌ ల్యాండ్‌ ఫ్రూవ్‌ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఎస్‌బీఐ అందించే ఈ లోన్‌ మీద ఎంసీఎల్‌ఆర్‌కు 3.3 శాతం అధిక వడ్డీ పడుతుంది. ఇక ప్రాసెసింగ్‌ ఫీజు, ఛార్జీల విషయానికి వస్తే.. 2 లక్షల రూపాయల వరకు లోన్‌ తీసుకుంటే.. ఎలాంటి ఛార్జీలుండవు. ఆపైన అయితే లోన్‌ మొత్తం మీద 1.4 శాతం ఛార్జీలు వసూలు చేస్తారు.

ఈ లోన్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే సమీపంలోని ఎస్‌బీఐ బ్యాంక్‌కు వెళ్లి అధికారులను సంప్రదించండి. అలానే ఎస్‌బీఐ మాత్రమే కాక.. ఇంతర బ్యాంకులు కూడా ట్రాక్టర్‌ లోన్‌లు అందిస్తాయి. అందుకే ఏ బ్యాంక్‌లో తక్కువ ఇంట్రెస్ట్‌ వసూలు చేస్తున్నారో కనుక్కుని.. దాని ఆధారంగా లోన్‌ తీసుకోవడం చాలా మంచిది అంటున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి