Somesekhar
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఐపీఎల్ అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. రోహిత్ చేసిన ఆరోపణలపై స్టార్ స్పోర్ట్స్ తాజాగా స్పందించింది. అసలు గొడవ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఐపీఎల్ అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. రోహిత్ చేసిన ఆరోపణలపై స్టార్ స్పోర్ట్స్ తాజాగా స్పందించింది. అసలు గొడవ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఐపీఎల్ అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కు మధ్య వివాదం చెలరేగింది. అసలేం జరిగిందంటే? ఇటీవల ముంబై ఇండియన్స్-కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తో మాట్లాడిన వీడియో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో పాటుగా లక్నోతో జరిగిన మ్యాచ్ లో సైతం టీమిండియా మాజీ ప్లేయర్ ధావళ్ కులకర్ణితో మాట్లాడుతూ కనిపించాడు. ఈ క్రమంలో కెమెరామెన్ వీడియో తీస్తుంటే రోహిత్ దండం పెట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే ఇప్పుడు గొడవకు దారితీసింది.
గ్రౌండ్ లో ఆటగాళ్ల మధ్య సంభాషణలను రికార్డ్ చేసి.. ప్రసారం చేయడంపై ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ అభ్యంతరం, అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి సంఘటనలు ప్లేయర్ల గోప్యతకు భంగం కలిగిస్తాయని రోహిత్ స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యానికి వివరించినా.. రికార్డ్ చేసి ప్రసారం చేసిందని రోహిత్ సోషల్ మీడియా వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ విషయంపై స్టార్ స్పోర్ట్స్ స్పందించింది. తాము రోహిత్ మాటలను రికార్డు చేసి, ప్రసారం చేయలేదని రోహిత్ ఆరోపణలను ఖండించింది.
“లక్నోతో మ్యాచ్ సందర్భంగా (మే 16) వాంఖడే స్టేడియంలో ట్రైనింగ్ సెషన్ లో రోహిత్ శర్మ తన స్నేహితులతో కలిసి మాట్లాడాడు. అయితే మేం ఇందుకు సంబంధించిన వీడియోను ఓ బ్రాడ్ కాస్టర్ గా చూపించాం అంతే. వారు మాట్లాడిన వీడియోను ప్రసారం చేయలేదు. ఇక రోహిత్ తాను మాట్లాడేది రికార్డు చేయెుద్దు అన్న వీడియో క్లిప్ ను మాత్రమే స్టార్ స్పోర్ట్స్ ప్రీ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసార కవరేజీలో ప్రదర్శించాం. ఆటగాళ్ల గోపత్య విషయంలో మేం కట్టుబడి ఉన్నాం” అంటూ స్టార్ స్పోర్ట్స్ వివరణ ఇచ్చుకుంది. కాగా.. ఆ వీడియోలు వైరల్ కావడంతో.. రోహిత్ శర్మ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మరి స్టార్ స్పోర్ట్స్ వివరణపై హిట్ మ్యాన్ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి. రోహిత్-స్టార్ స్పోర్ట్స్ గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.