iDreamPost
android-app
ios-app

చంద్రబాబు అరెస్ట్‌పై స్టాండప్‌ కమెడియన్‌ సెటైర్లు.. జైలు నుంచి జీతం వస్తుందా అంటూ

  • Published Sep 27, 2023 | 12:51 PM Updated Updated Sep 27, 2023 | 12:51 PM
  • Published Sep 27, 2023 | 12:51 PMUpdated Sep 27, 2023 | 12:51 PM
చంద్రబాబు అరెస్ట్‌పై స్టాండప్‌ కమెడియన్‌ సెటైర్లు.. జైలు నుంచి జీతం వస్తుందా అంటూ

చదివితే ఇంజనీరింగ్, లేదంటే మెడిసన్.. ఇవే రెండు ఆప్షన్లుగా కనిపిస్తున్న నేటి సమాజంలో తమ అభిరుచులకు తగ్గట్టు, తమకు ఇష్టమైన రంగాల్లో ప్రావీణ్యం సంపాదిస్తున్నారు కొందరు. అలాంటి రంగాల్లో ఒకటి స్టాండప్ కామెడీ. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం ఓ మహా కవి అన్నట్లు.. వీటిల్లో అత్యంత కష్టమైనది ఎదుటి వారిని నవ్వించడం. ఎవ్వరినీ హర్ట్ చేయకుండా, సెటెర్లు వేస్తూ నవ్విస్తుంటారు స్టాండప్ కమెడియన్స్. కేవలం మాటలతోనే మ్యాజిక్ చేస్తూ.. తమ మీద తాము జోకులు వేసుకుంటూ.. తనకు ఎదురైన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్‌ను ప్రేరణగా తీసుకుని కామెడీని పండిస్తుంటారు. అయితే స్టాండప్ కమెడియన్స్‌ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా స్పందిస్తున్నారు.

తమిళనాడుకు చెందిన వివేక్ మురళీధరన్ తనదైన స్టైల్లో స్టాండప్ కామెడీ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ చోట స్టాండప్ కామెడీ చేస్తూ.. ఏపీ రాజకీయాలపై ఫన్నీ జోక్ వేశారు. ఆ ప్రోగ్రామ్‌లో ఒక ఆడియన్‌ను మీరేం చేస్తారని ప్రశ్నించారు వివేక్. అతడు యాప్ డెవలపర్ అని సమాధానం ఇవ్వగానే.. ఏం యాప్ అని ప్రశ్నిస్తాడు స్టాండప్ కమెడియన్. వెంటనే అతడు సర్వే యాప్ అంటూ సమాధానమిచ్చాడు. తాను పొలిటికల్ సర్వే చేస్తాను అనగానే.. ఏ పార్టీకి అనగానే.. ఆంధ్రలో టీడీపీకి అని ఆడియన్ చెబుతాడు. చంద్రబాబు నాయుడు తరుఫున పార్టీకా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ‘సో సాడ్ మాన్ అంటూ శాలరీ జైలు నుండి తీసుకుంటావా’ సెటైర్ వేశారు. దీంతో అందరూ ఫన్నీగా నవ్వుకున్నారు. దీంతో కొంత మంది ఏంటీ బ్రో అంత మాట అన్నావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి విదితమే.

 

View this post on Instagram

 

A post shared by Vivek Muralidharan (@mightbevivek)


Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique