iDreamPost

టైటిల్ పెట్టడం ఒక కళ

టైటిల్ పెట్టడం ఒక కళ

ఇప్పుడు సినిమాలను తీయడం కన్నా వాటిని మార్కెటింగ్ చేసుకోవడం చాలా కీలకంగా మారింది. ఎంత గొప్ప చిత్రం తీసినా అది సరైన పద్ధతిలో జనంలోకి వెళ్లకపోతే నిర్మాతకు నష్టాలు తప్పవు. ముఖ్యంగా మాస్ సినిమాలు తగ్గిపోతున్న ట్రెండ్ లో ఆ వర్గాన్ని మెప్పించేలా స్టార్లు లేకుండా బడ్జెట్ మూవీని తీయడం అంత సులభం కాదు. ఇది రిస్కీ వ్యవహారంగా మారిపోయింది. ఈ సత్యాన్ని గుర్తించిన వాళ్ళు టైటిల్ తో మొదలుపెట్టి కంటెంట్ దాకా ప్రతి విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటున్నారు. దానికి ఉదాహరణగా శ్రీదేవి సోడా సెంటర్ ని చెప్పుకోవచ్చు. షూటింగ్ పూర్తి చేసుకోవడానికి దగ్గరలో ఉన్న ఈ సినిమా బిజినెస్ వ్యవహారాలు ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం శ్రీదేవి సోడా సెంటర్ పోస్ట్ థియేటర్ రైట్స్ ని జీ సంస్థ 9 కోట్లకు తీసుకున్నట్టు వస్తున్న వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నిజంగా ఇంత సొమ్ముని ఆఫర్ చేశారా లేక పబ్లిక్ లో బజ్ రావడం కోసం పిఆర్ టెక్నిక్ లు వాడి ఈ వార్తను బయటికి వదిలారా అనేదాని గురించి ఇంకా క్లారిటీ లేదు. సుధీర్ బాబు హీరోగా రూపొందిన శ్రీదేవి సోడా సెంటర్ కు పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. డెబ్యూతోనే తన టేకింగ్ మీద నమ్మకాన్ని ఏర్పరిచిన కరుణ కుమార్ ఆ మధ్య వదిలిన చిన్న టీజర్ తో బాగానే బజ్ తీసుకొచ్చాడు. ఏదో విషయం ఉందనే నమ్మకాన్ని కలిగించాడు.

ఇలాంటి డీల్స్ మీడియం బడ్జెట్ సినిమాలకు ఊతమిస్తున్నాయి. సామాన్య జనంలో చాలా వాడుక పదాలైన శ్రీదేవి, సోడా అనే పదాలను ఉపయోగించి ఇలా టైటిల్ ని సెట్ చేయడం మంచి క్రియేటివిటీ. ఇదెప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పుడే చెప్పలేం. జీ తీసుకున్నది కూడా డిజిటల్ ప్లస్ శాటిలైట్ హక్కులు కాబట్టి థియేటర్లో ఎప్పుడు వస్తుందనేది దానికి సంబంధం లేదు. నానితో కలిసి నటించిన వి డిజాస్టర్ కావడం సుధీర్ బాబుని బాగా నిరాశ పరిచింది. తాను హీరో నాని విలన్ అయినా ఎక్కువ పేరు రాకపోవడం ఇబ్బందే కదా. అందుకే మళ్ళీ సోలో హీరోగా నిలదొక్కుకోవడానికి ఈ సోడా సెంటర్ హెల్ప్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి