iDreamPost

యూట్యూబర్ అన్వేష్ కి శ్రీరెడ్డి కౌంటర్! ఉతికి పారేసింది!

ప్రపంచ యాత్రికుడు, యూట్యూబర్ నా అన్వేష్ పై నటి శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారుతోంది. అసలేం జరిగిందంటే?

ప్రపంచ యాత్రికుడు, యూట్యూబర్ నా అన్వేష్ పై నటి శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారుతోంది. అసలేం జరిగిందంటే?

యూట్యూబర్ అన్వేష్ కి  శ్రీరెడ్డి కౌంటర్! ఉతికి పారేసింది!

ప్రపంచ యాత్రికుడు, యూట్యూబర్ నా అన్వేష్.. అన్ని దేశాలు తిరుగుతూ వీడియోలు చేస్తూ వస్తున్నాడు. ఈ వీడియోల ద్వారా అతడు సోషల్ మీడియాలో చలామణి అవుతున్నాడు. ఇక అప్పుడప్పుడు రాజకీయాలపై కూడా స్పందిస్తుంటారు. ఇదిలా ఉంటే.. యూట్యూబర్ నా అన్వేష్ తాజాగా ఏపీ ప్రభుత్వంపై ఓ వీడియో రిలీజ్ చేశాడు. అందులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చుకోవాల్సింది పోయి.. డబ్బులిచ్చి జనాలను సోమరి పోతులను చేస్తున్నారంటూ విమర్శలు చేశాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన ఏపీ ప్రజలు యూట్యూబర్ నా అన్వేష్ వ్యాఖ్యలపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నా అన్వేష్ వీడియోపై నటి శ్రీరెడ్డి ఘాటుగా స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇంతే కాకుండా ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలియకుండా నా అన్వేష్ అలా మాట్లాడడం అస్సలు బాలేదంటూ యూట్యూబర్ నా అన్వేష్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇంతకు యూట్యూబర్ నా అన్వేష్ వీడియోపై ఎలా స్పందించిందంటే?

యూట్యూబర్ నా అన్వేష్ వ్యాఖ్యలకు శ్రీరెడ్డి కౌంటర్ ఇస్తూ.. జింబాబ్వేను పొలుస్తూ మాట్లాడావు కదా నా అన్వేష్.. అసలు నీకు ఏపీ తలసరి ఆదాయం ఎంతో తెలుసా? గత ఐదేళ్లల్లో 17వ స్థానం నుంచి 9వ స్థానానికి ఎదిగిందంన్న విషయం నీకు తెలుసా? యూట్యూబర్ నా అన్వేష్.. నువ్వు ఎవరి దగ్గరి నుంచి ఫండ్ తీసుకున్నవో మాకు తెలుసు. సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖను రాజధాని చేశారు. అసలు విశాఖ వాసిగా నువ్వు ఏనాడైన ఈ విషయంపై సంతోషం వ్యక్తం చేశావా? అసలు ఆంధ్రప్రదేశ్ లో పేద ప్రజల బాధలు ఎలా ఉంటాయో నీకు తెలుసా? గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయం వల్ల ఏమోస్తుంది.. బోందా అని అన్నారు.

ఆ టైమ్ లో పంట నష్టం రాక, విత్తనాలు సరైనవి దొరక ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు నేను అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఇక రైతులకు నేనున్నానని ధీమా ఇవ్వడంతో పాటు వడ్డీ లేని రుణాలు అందించారు. ఇవే కాకుండా ఏపీలో పాఠశాలలు ఉన్నాయో నా అన్వేష్ చూడాలి. నాడు నేడు, జగనన్న గోరు ముద్ద, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇలా ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టారు. ఇక స్కూల్లో మంచి భోజనం పెడుతున్నారని వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు.

ప్రజలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవే కాకుండా సీఎం జగన్ మోహన్ మహిళలకు ఎన్నో రకాల రుణాలు అందిస్తున్నారు. దీంతో పాటు విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులను ప్రొత్సహిస్తూ వారిని ఇతర దేశాలను పంపిస్తున్నారు. జనాలకు డబ్బులు ఇచ్చి సోమరు పోతులను చేస్తున్నది అంటే ఇదేనా అంటూ శ్రీరెడ్డి నా అన్వేష్ ని గట్టిగా ప్రశ్నించారు. ఇదే వీడియోను శ్రీరెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్స్.. శ్రీరెడ్డి మాటల్లో నిజమే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి