iDreamPost
android-app
ios-app

T20 World Cup 2024: ఇది అన్యాయం.. ఐసీసీపై శ్రీలంక స్టార్ ప్లేయర్ ఆగ్రహం! ఎందుకంటే?

  • Published Jun 05, 2024 | 4:08 PM Updated Updated Jun 05, 2024 | 4:08 PM

శ్రీలంక స్టార్ స్పిన్నర్ మహేశ్ తీక్షణ తమకు ఈ వరల్డ్ కప్ లో ఐసీసీ అన్యాయం చేసిందని సంచలన ఆరోపణలతో పాటుగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరి లంక టీమ్ కు ఐసీసీ చేసిన అన్యాయం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

శ్రీలంక స్టార్ స్పిన్నర్ మహేశ్ తీక్షణ తమకు ఈ వరల్డ్ కప్ లో ఐసీసీ అన్యాయం చేసిందని సంచలన ఆరోపణలతో పాటుగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరి లంక టీమ్ కు ఐసీసీ చేసిన అన్యాయం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

T20 World Cup 2024: ఇది అన్యాయం.. ఐసీసీపై శ్రీలంక స్టార్ ప్లేయర్ ఆగ్రహం! ఎందుకంటే?

టీ20 వరల్డ్ కప్ 2024 మెగా టోర్నీ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. సంచలనాలు నమోదు అవుతూ.. క్రికెట్ ప్రేమికులను అలరిస్తూ మినీ సమరం ముందుకుసాగుతోంది. అయితే ఈ మెగా టోర్నీలో భాగంగా ఆడిన తొలి మ్యాచ్ లోనే హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన శ్రీలంక దారుణంగా ఓడిపోయింది. సౌతాఫ్రికా లంకను మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో లంక స్టార్ స్పిన్నర్ మహేశ్ తీక్షణ తమకు ఈ వరల్డ్ కప్ లో ఐసీసీ అన్యాయం చేసిందని సంచలన ఆరోపణలతో పాటుగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

టీ20 వరల్డ్ కప్ ను శ్రీలంక దారుణ ఓటమితో ప్రారంభించింది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్ లో కేవలం 77 పరుగుల స్వల్ప స్కోర్ కే ఆలౌట్ అయ్యి.. చెత్త రికార్డ్ ను మూటగట్టుకోవడమే కాక ఓడిపోయింది. ఇదిలా ఉండగా.. ఈ వరల్డ్ కప్ లో ఐసీసీ తమకు అన్యాయం చేసిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు లంక స్టార్ స్పిన్నర్ మహేశ్ తీక్షణ. ఈ వరల్డ్ కప్ షెడ్యూల్ పట్ల  తీవ్ర అసంతృప్తిని వ్యక్త పరిచాడు.

మహేశ్ తీక్షణ మాట్లాడుతూ..”ఈ వరల్డ్ కప్ లో మాకు అన్యాయం జరిగింది. మా టీమ్ గ్రూప్ స్టేజ్ లో నాలుగు మ్యాచ్ లు నాలుగు విభిన్నమైన గ్రౌండ్స్ లో ఆడటం ఏంటి? మిగత జట్లు దాదాపు అన్ని మ్యాచ్ లు ఒకే గ్రౌండ్ లో ఆడుతున్నాయి. శ్రీలంక టీమ్ కే ఎందుకు ఇలా. ఇక మా హోటల్ నుంచి గ్రౌండ్ కు వెళ్లేందుకు దాదాపు గంటా 40 నిమిషాల టైమ్ పడుతోంది. మిగతా టీమ్స్ కు కేవలం 15 నిమిషాలే పడుతోంది. సౌతాఫ్రికాతో మ్యాచ్ కోసం న్యూయార్క్ కు వచ్చే టైమ్ లో మా టీమ్ 8 గంటలు ఎయిర్ పోర్ట్ లోనే వేచి చూసింది. ఇది అన్యాయం. అయితే ఇప్పుడు షెడ్యూల్ లో మార్పులు చేయడం కష్టం. కానీ భవిష్యత్ లో ఇలాంటి సమస్యలు రాకుండా చూడండి” అని చెప్పుకొచ్చాడు. కాగా.. గ్రూప్-డిలో సౌతాఫ్రికా, శ్రీలంకతో పాటుగా బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్ టీమ్స్ ఉన్నాయి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే? గ్రూప్ స్టేజ్ లో ఆడే నాలుగు మ్యాచ్ లు శ్రీలంక, నెదర్లాండ్స్ మాత్రమే నాలుగు భిన్నమైన వేదికల్లో ఆడాల్సి ఉంది. మరి మాకు అన్యాయం జరిగింది అన్న  మహేశ్ తీక్షణ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by CricTracker (@crictracker)

ఇదికూడా చదవండి: Rohit Sharma: ఆ ఒక్క ఆలోచనే నన్ను నడిపిస్తోంది.. రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!