iDreamPost
android-app
ios-app

భారత్​లో వేల కోట్ల బిజినెస్​ను మొదలుపెట్టిన మురళీధరన్.. ఎక్కడంటే?

  • Published Jun 19, 2024 | 6:24 PM Updated Updated Jun 19, 2024 | 6:24 PM

శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ కోచింగ్​ చేస్తూనే మరోవైపు పలు వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. ఇందులో భాగంగానే భారత్​లో కోట్ల రూపాయల పెట్టుబడితో ఓ బిజినెస్​ను ప్రారంభించాడు.

శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ కోచింగ్​ చేస్తూనే మరోవైపు పలు వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. ఇందులో భాగంగానే భారత్​లో కోట్ల రూపాయల పెట్టుబడితో ఓ బిజినెస్​ను ప్రారంభించాడు.

  • Published Jun 19, 2024 | 6:24 PMUpdated Jun 19, 2024 | 6:24 PM
భారత్​లో వేల కోట్ల బిజినెస్​ను మొదలుపెట్టిన మురళీధరన్.. ఎక్కడంటే?

ఒకప్పుడు క్రికెటర్లు గేమ్ మీదే బాగా డిపెండ్ అయ్యేవారు. క్రికెటర్లు అనే కాదు.. ఇతర క్రీడలకు చెందిన వాళ్లు కూడా తమ ఆటేదో తాము ఆడుకోవడం అన్నట్లు ఉండేవారు. గేమ్​కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత కోచింగ్​ చేయడం లేదా కామెంట్రీ చెప్పుకోవడం లాంటివి చేసేవారు. కానీ ఈ రోజుల్లో అంతా మారిపోయింది. అదనపు ఆదాయపు మార్గాలను అందరూ అన్వేషిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే కాన్సెప్ట్​ను ఫాలో అవుతున్నారు. గేమ్స్​లో యాక్టివ్​గా ఉన్న టైమ్​లోనే బిజినెస్ సైడ్ కూడా వెళ్తున్నారు. స్పోర్ట్స్​, అడ్వర్టయిజ్​మెంట్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వ్యాపార రంగంలో పెట్టుబడిగా పెడుతూ మరింత లాభాలు గడిస్తున్నారు. గేమ్స్ మీదే డిపెండ్ అవకుండా అదనపు ఆదాయ మార్గాలు చూసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.

శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ కూడా ఇదే కోవలోకి వస్తాడు. కొన్నేళ్ల పాటు తన స్పిన్ బౌలింగ్​తో క్రికెట్​ను శాసించాడీ లెజెండ్. అద్భుతమైన బౌలింగ్​తో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను వణికించాడు. ఏళ్ల పాటు సూపర్బ్​ ఆటతీరుతో ఎవర్​గ్రీన్​ క్రికెటర్​గా నిలిచాడు. అయితే క్రికెటర్​గా కొనసాగుతున్న టైమ్​లోనే బయట కొన్ని వ్యాపారాలు కూడా మొదలుపెట్టాడు మురళీధరన్. గేమ్​కు గుడ్​బై చెప్పాక వాటిపై మరింత ఫోకస్ చేశాడు. అందులో ఒకటి ముత్తయ్య బేవరెజెస్ అండ్ కన్ఫెక్షనరీస్ సంస్థ. ఈ శీతల పానీయాల సంస్థ ద్వారా భారీ లాభాలు గడిస్తున్న లంక దిగ్గజం.. ఇప్పుడు తన వ్యాపారాన్ని భారత్​కు విస్తరించాడు. కర్ణాటకలోని చామరాజనగర్ డిస్ట్రిక్ట్​లో 1,400 కోట్ల ఇన్వెస్ట్​మెంట్​తో బేవరెజెస్ యూనిట్​ను నెలకొల్పనున్నాడు మురళీధరన్.

శీతల పానీయాల తయారీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి కర్ణాటక సర్కారుతో మురళీధరన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముత్తయ్య బేవరెజెస్ అండ్ కన్ఫెక్షనరీస్ కోసం బడనగుప్పే అనే ప్రాంతంలో 46 ఎకరాల స్థలాన్ని కేటాయించింది కర్ణాటక ప్రభుత్వం. ఈ మేరకు గవర్నమెంట్​కు మురళీధరన్​కు మధ్య అగ్రిమెంట్ కుదిరింది. ఆ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఈ విషయాన్ని ధృవీకరించారు. మురళీధరన్ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ పనులు వచ్చే ఏడాది జనవరి నుంచి స్టార్ట్ అవుతాయని తెలుస్తోంది. ఇక్కడ సక్సెస్ అయితే వ్యాపారాన్ని ధార్వడ్ జిల్లాకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక, 52 ఏళ్ల మురళీధరన్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ టీమ్​కు స్ట్రాటజిక్ కోచ్​గా సేవలు అందిస్తున్నాడు.