Arjun Suravaram
Arjun Suravaram
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ లో సిరాజ్ వీర విహారం చేశాడు. నిప్పులు వంటి బంతులను సంధిస్తూ లంకేయులను వణికించిన మహమ్మద్ సిరాజ్ కెరీర్ లో బెస్ట్ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ అరుదైన రికార్డుని కూడా నెలకొల్పి.. టీమిండియా తరుపున ఆ ఘనత అందుకున్న ఒకే ఒక్క బౌలర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక కెప్టెన్.. తాను తీసుకున్న నిర్ణయం తప్పని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు.
తొలి స్పెల్ లోనే సిరాజ్ నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్ లో సిరాజ్ మొదటి బంతికి నిస్సంకని అవుట్ చేసి.. లంక పతనాన్ని మొదలు పెట్టాడు. ఇక అక్కడ నుండి.. వరుసగా సమరవిక్రమ, అసలంక, ధనుంజయ వికెట్స్ అదే ఓవర్ లో తీసి లంక నడ్డి విరిచాడు. ఇక తన మూడో ఓవర్ లో ఆ జట్టు కెప్టెన్ శనకాని డకౌట్ చేసిన సిరాజ్.. కాసేపటికే కుశల్ మెండీస్ ని కూడా పెవిలియన్ చేర్చడం తొలిసారి 6 వికెట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక మన హైదరాబాదీ బౌలర్ ధాటికి కొన్ని రికార్డ్స్ సైతం గల్లంతు అయ్యాయి. ఒకే ఓవర్ లో 4 వికెట్స్ తీసిన తొలి టీమిండియా బౌలర్ గా సిరాజ్ రికార్డు నెలకొల్పాడు. అలాగే.. ఇది వరకు ఓకే ఓవర్ లో నాలుగు వికెట్స్ దక్కించుకున్న మలింగా రికార్డుని సైతం సిరాజ్ సమం చేసినట్టు అయ్యింది. ఒకానొక సమయంలో సిరాజ్ తన మొదటి 15 బంతులకే 5 వికెట్స్ దక్కించుకున్నాడు అంటే.. అతని బౌలింగ్ ఏ స్థాయిలో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక.. సిరాజ్ ధాటికి లంక కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయ్యింది. లంక జట్టులో ఒక ప్లేయర్ కూడా టీమిండియా బౌలింగ్ దళం ముందు నిలువలేకపోయారు. లంక జట్టులో కుశల్ మెండీస్ సాధించిన 17 పరుగులే అత్యధికం కావడం విశేషం.
ఇక ఈ మ్యాచ్ లో సిరాజ్ ఖాతాలో 6 వికెట్స్ పడగా.. హార్దిక్ పాండ్యా 3, బూమ్రా ఒక వికెట్ సొంతం చేసుకున్నారు. వన్డే క్రికెట్ చరిత్రలో లంక చేసిన ఈ 50 పరుగులు లోయెస్ట్ స్కోర్ రికార్డ్స్ లో చేరడం విశేషం. 2000 సంవత్సరంలో ఇండియా ఇదే శ్రీలంక చేతిలో 54 పరుగులకే ఆలౌట్ అయ్యి అపఖ్యాతి మూట కట్టుకుంది. 23 ఏళ్ళ తరువాత లంకని అంతకన్నా తక్కువ స్కోర్ కి ఆలౌట్ చేసి.. భారత్ పగ తీర్చుకున్నట్టు అయ్యింది. మరి.. వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ ముందు.. ఓవర్ లో 4 వికెట్స్ తీసి, కెరీర్ లో తొలిసారి 6 వికెట్స్ దక్కించుకున్న మన హైదరాబాద్ పేసర్ కి కామెంట్స్ రూపంలో మీ విషెస్ అందించండి.
India needs just 51 To Win the Asia Cup Final 2023♥️💯.#AsianCup2023 #INDvsSL #SLvIND pic.twitter.com/TxL7TYJN7E
— Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) September 17, 2023