iDreamPost

ఆసియా కప్ ఫైనల్ లో సిరాజ్ నిప్పులు! 12 పరుగులకే 6 వికెట్స్!

ఆసియా కప్ ఫైనల్ లో సిరాజ్ నిప్పులు! 12 పరుగులకే 6 వికెట్స్!

శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ లో టీమిండియాకి శుభారంభం లభించింది. వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్ లో శ్రీలంక ముందుగా బ్యాటింగ్ చేసింది. అయితే.. తొలి బంతి నుండే నిప్పులు చెరిగిన బుమ్రా తొలి ఓవర్ లోనే ఆ జట్టు ఓపెనర్ కుశాల్ పెరీరాని అవుట్ చేసి మంచి ఆరంభం అందించాడు. ఇక బుమ్రాతో కలిసి స్పెల్ వేసిన సిరాజ్ కూడా తొలి ఓవర్ నుండే లయ అందుకొవడంతో లంకకి పరుగులు చేయడం అసాధ్యం అయ్యింది. దీంతో.. ఆత్మ రక్షణలో పడ్డ లంకేయన్స్ పరుగులు చేయడం కన్నా.. వికెట్స్ కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించారు. కానీ.., ఇక్కడ మహ్మద్ సిరాజ్ తన రెండో ఓవర్ లో అద్భుతం చేశాడు.

మూడో ఓవర్ లో తొలి బంతికి నిస్సంకాని పెవిలియన్ చేర్చిన సిరాజ్.. అక్కడ నుండి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మూడో ఓవర్ లో మూడో బంతికి సమరవిక్రమని అవుట్ చేసి భారత్ శిబిరంలో ఉత్సహాన్ని నింపేశాడు. ఆ మరుసటి బంతికే ఫామ్ లో ఉన్న అసలంక వికెట్ కూడా తీసిన సిరాజ్ లంక పతనానికి బాటలు వేశాడు. తరువాత క్రీజ్ లోకి వచ్చిన ధనుంజయ మూడో ఓవర్ లోని 5వ బంతిని బౌండరీకి పంపడం విశేషం. దీంతో.. వరుస వికెట్స్ కి కాస్త విరామం దొరికినట్టే అని లంక ఫ్యాన్స్ భావించారు. కానీ.., ఆ ఓవర్ లో అప్పటికే 3 వికెట్స్ తీసిన సిరాజ్.. చివరి బంతిలో కూడా ధనుంజయ డిసిల్వాని అవుట్ చేయడంతో శ్రీలంక కోలుకోలేని దెబ్బ తిన్నట్టు అయ్యింది.

4 ఓవర్లో 8 పరుగులకే 4 వికెట్స్ కోల్పోయిన స్థితిలో కూడా శ్రీలంకపై సిరాజ్ జాలి చూపించలేదు. మళ్ళీ 5 ఓవర్లో లో బౌలింగ్ కి వచ్చిన సిరాజ్ ఆ జట్టు కెప్టెన్ ని సైతం క్లీన్ బౌల్డ్ చేసి దుమ్ము దులిపేశాడు. సిరాజ్ ధాటికి శ్రీలంక 12 పరుగులకే 6 వికెట్స్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఆ జట్టుకి మద్దతు తెలపడానికి గ్రౌండ్ కి వచ్చిన అభిమానులు సైతం సిరాజ్ నిప్పుల వర్షానికి కన్నీరు పెట్టుకోవాల్సి వచ్చింది. ఓ రకంగా సంధిస్తున్న ప్రతి బంతికి సిరాజ్ వికెట్ తీసేలా కనిపిస్తుండటంతో లంక బ్యాటర్స్ వణికిపోతున్నారు. ఇక ఈ అద్భుత ప్రదర్శనతో సిరాజ్ పేరుపై అనేక రికార్డ్స్ నమోదు అవ్వడం విశేషం. మరి,, వరల్డ్ కప్ ముందు సిరాజ్ నుండి ఇంతటి అద్భుత ప్రదర్శన రావడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి