iDreamPost
android-app
ios-app

SRHకు వరంగా మారిన RCB శాపం.. ఇదే జోష్​లో కప్పు కైవసం!

  • Published May 25, 2024 | 4:13 PMUpdated May 25, 2024 | 4:13 PM

సన్​రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అనుకున్నది సాధించాడు. టోర్నీ ఫైనల్​కు వెళ్లడమే టార్గెట్ అని చెప్పి.. దాన్ని చేసి చూపించాడు. రాజస్థాన్ రాయల్స్​ను చిత్తు చేసి తుదిపోరుకు అర్హత సాధించింది ఆరెంజ్ ఆర్మీ.

సన్​రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అనుకున్నది సాధించాడు. టోర్నీ ఫైనల్​కు వెళ్లడమే టార్గెట్ అని చెప్పి.. దాన్ని చేసి చూపించాడు. రాజస్థాన్ రాయల్స్​ను చిత్తు చేసి తుదిపోరుకు అర్హత సాధించింది ఆరెంజ్ ఆర్మీ.

  • Published May 25, 2024 | 4:13 PMUpdated May 25, 2024 | 4:13 PM
SRHకు వరంగా మారిన RCB శాపం.. ఇదే జోష్​లో కప్పు కైవసం!

సన్​రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అనుకున్నది సాధించాడు. ఈసారి ఐపీఎల్ టోర్నీ ఫైనల్​కు వెళ్లడమే టార్గెట్ అని చెప్పి.. దాన్ని చేసి చూపించాడు. రాజస్థాన్ రాయల్స్​ను చిత్తు చేసి తుదిపోరుకు అర్హత సాధించింది ఆరెంజ్ ఆర్మీ. నిన్న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన క్వాలిఫైయర్స్​ 2లో ఎస్​ఆర్​హెచ్ 36 పరుగుల తేడాతో సంజూ సేనను ఓడించింది. ఈ మ్యాచ్​లో టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన సన్​రైజర్స్ ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులే చేయగలిగింది. బ్యాటింగ్​లో విలువైన 18 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్​లో కీలకమైన 3 వికెట్లతో మ్యాచ్​ను మలుపు తిప్పిన ఆల్​రౌండర్ షాబాజ్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​ అవార్డును అందుకున్నాడు.

క్వాలిఫైయర్-2లో రాజస్థాన్ ఫేవరెట్​గా కనిపించింది. ఎలిమినేటర్​లో ఆర్సీబీని చిత్తు చేసి రావడంతో ఆ టీమ్ మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు క్వాలిఫైయర్-1లో కోల్​కతా నైట్ రైడర్స్​ చేతుల్లో ఓటమితో సన్​రైజర్స్ డీలాపడిపోయింది. దీంతో ఫైనల్ ఫైట్​కు ఎస్​ఆర్​హెచ్​ చేరడం కష్టమేనని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే నిన్న మ్యాచ్​లో బ్యాటింగ్​లో 120 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది కమిన్స్ సేన. ఆ తర్వాత బౌలింగ్​లో టైమ్​లో 60 పరుగులు దాటినా ఒకే వికెట్ తీయగలిగింది. అయితే ఈ రెండు సందర్భాల్లోనూ అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు అద్భుతంగా ఫైట్​ చేసి టీమ్​ను ఒడ్డును చేర్చారు. అయితే ఆరెంజ్ ఆర్మీకి సొంత ఆటగాళ్ల పోరాటంతో పాటు ఆర్సీబీ జట్టు శాపం కూడా కలిసొచ్చింది.

ఆర్సీబీ శాపం.. ఎస్​ఆర్​హెచ్​కు వరంగా మారింది. కమిన్స్ సేన ఫైనల్స్​కు వెళ్లడంలో కోహ్లీ టీమ్ శాపం కలిసొచ్చింది. బెంగళూరును ప్లేఆఫ్స్​లో ఓడించిన టీమ్​ కప్పు గెలిచినట్లు ఐపీఎల్ చరిత్రలోనే లేదు. ఆ టీమ్ 6 సార్లు ప్లేఆఫ్స్​ నుంచి బయటకు వచ్చేసింది. ఇలా ఎలిమినేట్ అయిన ఆరుసార్లు కూడా ఆ జట్టును ఓడించిన అపోజిషన్ టీమ్స్ కప్పును అందుకోకుండానే ఒట్టి చేతులతో ఇంటిదారి పట్టాయి. 2010లో ప్లేఆఫ్స్​లో ఆర్సీబీని ఓడించింది ముంబై. కానీ ఫైనల్​లో సీఎస్​కే చేతుల్లో ఓడి టైటిల్​ను మిస్సైంది.

2015లో ప్లేఆఫ్స్​లో బెంగళూరును నాకౌట్ చేసింది చెన్నై. అయితే ఫైనల్​లో ముంబై మీద ఓడిపోయింది. 2020లో ఆర్సీబీని ఓడించింది సన్​రైజర్స్. అయితే క్వాలిఫైయర్​-2లో ఢిల్లీ చేతుల్లో ఓడింది. ఐపీఎల్-2021లో ఆర్సీబీని నాకౌట్ చేసింది కేకేఆర్. ఆ టీమ్​ ఫైనల్​లో చెన్నై చేతుల్లో పరాజయం పాలైంది. మరుసటి ఏడాది ఇదే రాజస్థాన్ ప్లేఆఫ్స్​లో బెంగళూరును చిత్తు చేసింది. అయితే ఫైనల్​లో గుజరాత్ మీద ఓడి రన్నరప్​తో సరిపెట్టుకుంది. ఈసారి కూడా ఆర్సీబీని ఓడించి సంతోషంలో మునిగిపోయింది. కానీ క్వాలిఫైయర్​-2లో ఆరెంజ్ ఆర్మీ చేతుల్లో చిత్తయింది.

 

View this post on Instagram

 

A post shared by RVCJ Media (@rvcjinsta)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి