Nidhan
కప్పు కలను నెరవేర్చుకునే పనిలో మరో ముందడుగు వేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసి ఐపీఎల్-2024 ఫైనల్స్‌కు చేరుకుంది. టైటిల్‌కు ఇంకో అడుగు దూరంలో నిలిచింది.
కప్పు కలను నెరవేర్చుకునే పనిలో మరో ముందడుగు వేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసి ఐపీఎల్-2024 ఫైనల్స్‌కు చేరుకుంది. టైటిల్‌కు ఇంకో అడుగు దూరంలో నిలిచింది.
Nidhan
సామాన్య నేపథ్యం నుంచి వచ్చి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వారు ఎందరో ఉన్నారు. కృషి, పట్టుదలతో తమ కలల్ని నిజం చేసుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే అథ: పాతాళం నుంచి అత్యున్నత శిఖరాలను చేరే క్రమంలో ఎన్నో కష్టనష్టాలను చూడాల్సి ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకొని నిలబడితేనే అనుకున్న గమ్యానికి చేరుకోవచ్చు. జీవితంలో జరిగే కొన్ని ఘటనలే వారిని విజేతలను చేస్తాయి. గెలవాలనే కసిని, తపనను పెంచుతాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లైఫ్‌లోనూ ఇలాంటి ఓ కీలకమైన ఘటన జరిగింది. అది అతడ్ని పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు జస్ట్ బౌలర్‌గా ఉన్నోడు.. ఇప్పుడు తోపు బౌలర్‌గా, గ్రేట్ కెప్టెన్‌గా ఎదిగాడు. దీనికి ఆ ఘటనే కారణం.
ఐపీఎల్ కప్పు కలను నెరవేర్చుకునే పనిలో మరో ముందడుగు వేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు. క్వాలిఫైయర్స్-2లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసి ఫైనల్స్‌కు చేరుకుంది. టైటిల్‌కు ఇంకో అడుగు దూరంలో నిలిచింది. సండే ఫైట్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడిస్తే కప్పు ఆరెంజ్ ఆర్మీ సొంతం అవుతుంది. గత సీజన్లో పదో పొజిషన్లో ఉన్న జట్లు ఇప్పుడు ఫైనల్‌కు చేరుకుందంటే మామూలు విషయం కాదు. దీని వెనుక ఎన్ని కారణాలున్నా.. అన్నింటి కంటే బిగ్ రీజన్ కెప్టెన్ కమిన్స్. అతడి సారథ్యం వల్లే టీమ్ ఈ స్థాయికి చేరుకుంది. ఒక ఏడాది వ్యవధిలో ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, యాషెస్ ట్రోఫీలు అందించాడు కమిన్స్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ను ఛాంపియన్‌గా నిలబెట్టేందుకు పోరాడుతున్నాడు. అయితే అతడి సక్సెస్ వెనుక కేజీఎఫ్ రేంజ్ ఫ్లాష్‌బ్యాక్ ఉంది. అమ్మ ప్రేమే అతడ్ని ఈ స్థాయికి చేర్చింది.
కమిన్స్ విజయాల వెనుక ఓ కన్నీటి కథ ఉంది. అతడికి తల్లి మరియా అంటే పిచ్చి ప్రేమ. ఆమె కోసం ఏం చేయడానికైనా కమిన్స్ సిద్ధంగా ఉంటాడు. ఆస్ట్రేలియా జట్టుకు ఆడుతూ కొడుకు మంచి పేరు తెచ్చుకుంటే ఆమె ఎంతో సంతోషించింది. అయితే బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతూ గతేడాది మార్చిలో ఆమె కన్నుమూసింది. అయితే మరణానికి కొన్ని రోజుల ముందు కమిన్స్‌కు ఆమె ధైర్యం నూరిపోసింది. తన గురించి కాదు.. కెరీర్ గురించి ఆలోచించాలని చెప్పింది. ఇదే విషయాన్ని కమిన్స్ ఇటీవల షేర్ చేశాడు. వెళ్లు.. ప్రపంచాన్ని ఏలు, అది నీదే, నువ్వు ఛాంపియన్వి అని తన తల్లి చెప్పిందన్నాడు. ఈ ఒక్క ఘటనతో కమిన్స్ పూర్తిగా మారిపోయాడు. కెప్టెన్‌గా కొత్త కథను రాయడం మొదలుపెట్టాడు. ఫియర్లెస్ అప్రోచ్‌తో క్రికెట్ వరల్డ్‌ను భయపెట్టాడు. ఏడాది గ్యాప్‌లో రెండు ఐసీసీ ట్రోఫీలను ఆసీస్‌కు అందించాడు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ను కూడా ఛాంపియన్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. మరి.. కమిన్స్ ఆరెంజ్ ఆర్మీ కప్పు కల తీరుస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.