iDreamPost

వీడియో: ట్రావిస్ హెడ్, క్లాసెన్ కాదు.. సమద్ చేసింది అసలైన విధ్వంసం అంటే..

SRH vs RCB- Abdul Samad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ చరిత్రలోనే మరోసారి అత్యధిక స్కోర్ ని నమోదు చేసింది.

SRH vs RCB- Abdul Samad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ చరిత్రలోనే మరోసారి అత్యధిక స్కోర్ ని నమోదు చేసింది.

వీడియో: ట్రావిస్ హెడ్, క్లాసెన్ కాదు.. సమద్ చేసింది అసలైన విధ్వంసం అంటే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పుడే కాదు.. ఇంకో రెండేళ్లు పోయినా కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విధ్వంసం గురించే మాట్లాడుకుంటారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు చేయడం మాత్రమే కాకుండా.. ఆ రికార్డును మరోసారి బద్దలు కూడా కొట్టింది. ఐపీఎల్ హిస్టరీలో 287/3, 277/3 టాప్ 2 అత్యధిక స్కోర్లు హైదరాబాద్ జట్టు పేరిటే ఉన్నాయి. ఈ రికార్డును మరో జట్టు బ్రేక్ చేయడం దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే హైదరాబాద్ జట్టు కప్పు కొడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్ లో ప్రతి బాల్ ని ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేశారు. అయితే ఈ మ్యాచ్ లో అంతా ట్రావిస్ హెడ్, క్లాసెన్ గురించే మాట్లాడుతున్నారు. కానీ వారిని మించి సమద్ విధ్వంసం సృష్టించాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ అసలైన విధ్వంసం అంటే ఏంటో క్రికెట్ ఫ్యాన్స్ కి చాటిచెప్పింది. ఈ మ్యాచ్ లో బౌండరీల వర్షం కురిసింది. పరుగుల వరద పారింది. మరోసారి హైదరాబాద్ జట్టు అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ముంబయి మీద జరిగిన మ్యాచ్ లో నెలకొల్పిన రికార్డును మళ్లీ బద్దలు కొట్టింది. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ అద్భుతమైన శతకంతో చెలరేగాడు. మరోవైపు క్లాసెన్ కూడా విధ్వంసం సృష్టించాడు. కానీ, వీళ్లిద్దరు అవుటైన తర్వాత హైదరాబాద్ జట్టు స్కోర్ ఇంత దూరం వస్తుంది అని ఎవరూ అనుకోలేదు. కానీ, మార్కరమ్ తో కలిసి అబ్దుల్ సమద్ పెను విధ్వంసమే సృష్టించాడు.

ఈ మ్యాచ్ లో అబ్దుల్ సమద్ ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కేవలం 10 బంతుల్లోనే ఏకంగా 37 పరుగులు నమోదు చేశాడు. అందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. నిజానికి ఇంకో 4 బంతులు ఉంటే వేగవంతమైన అర్ధ శతకం కూడా నమోదు చేసేవాడు. అతని ఇన్నింగ్స్ అంత ప్రమాదకరంగా సాగింది. అందరూ హెడ్, క్లాసెన్ గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ, సమద్ ఏకంగా 370 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. ఒకానొక సమయంలో 270 కూడా స్కోర్ కాదు అనుకున్న తరుణంలో సమద్ చెలరేగాడు. 19వ ఓవర్లో వరుసగా 4, 4, 6, 6, 4 బౌండిరీలు బాదాడు. కేవలం 5 బంతుల్లోనే 24 పరుగులు చేశాడు. ఆ ఓవర్లో మొత్తం 25 పరుగులు వచ్చాయి.

అలాగే ఆఖరి ఓవర్లో కూడా మార్కరమ్, సమద్ విధ్వంసాన్ని కొనసాగించారు. 20వ ఓవర్లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడే కప్పు కొట్టేసినంత ఆనందంగా ఉన్నారు. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ యూనిట్ పై ఇప్పటివరకు ఎన్నో విమర్శలు వచ్చేవి. కానీ, ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లు నమోదు చేయడం చూసి ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. మరి.. హెడ్, క్లాసెన్ ని మించి సమద్ విధ్వంసం సృష్టించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి