Nidhan
సన్‌రైజర్స్ హైదరాబాద్ పగతో రగిలిపోతోంది. ఫైనల్ ఫైట్‌లో అతడి అంతు చూడాలనుకుంటోంది. అతడ్ని బాది పారేయాలని టీమ్ బ్యాటర్లంతా కసితో ఉన్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ పగతో రగిలిపోతోంది. ఫైనల్ ఫైట్‌లో అతడి అంతు చూడాలనుకుంటోంది. అతడ్ని బాది పారేయాలని టీమ్ బ్యాటర్లంతా కసితో ఉన్నారు.
Nidhan
 
        
ఐపీఎల్-2024 ఆరంభం నుంచి అదరగొడుతూ వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ప్లేఆఫ్స్‌లోనూ అదే దూకుడును కొనసాగించలేకపోయింది. క్వాలిఫైయర్-2లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతుల్లో ఓడి ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది కమిన్స్ సేన. ఆ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ దారుణంగా పెర్ఫార్మ్ చేసింది. దీంతో నిరాశలో ఉన్న ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడి మధ్య క్వాలిఫైయర్-2లో ఎలా ఆడతారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అసలు సిసలైన గేమ్‌ను బయటకు తీసుకొచ్చారు. అన్నింటా సంజూ సేనను డామినేట్ చేసి ఫైనల్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకున్నారు. రాజస్థాన్‌ను 36 పరుగుల తేడాతో మట్టికరిపించిన ఎస్ఆర్హెచ్.. తుదిపోరులో కేకేఆర్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
కోల్‌కతాతో జరిగే టైటిల్ ఫైట్‌లో గెలిచి కప్పును సొంతం చేసుకోవాలని సన్‌రైజర్స్ ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో నెగ్గడంతో కమిన్స్ సేనకు ఇంకో పని కూడా ఉంది. ఈ మ్యాచ్‌తో కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణా మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది ఎస్ఆర్హెచ్. అతడు దొరికితే బాది పారేయాలని టీమ్ బ్యాటర్లు అంతా కాచుకొని ఉన్నారు. అతడి బౌలింగ్‌లో కసిగా భారీ షాట్లు బాదాలని ఓపెనర్లు హెడ్, అభిషేక్ దగ్గర నుంచి కెప్టెన్ కమిన్స్ వరకు అంతా ఫిక్స్ అయ్యారు. సీజన్ మొదట్లో అతడు చేసిన అవమానానికి అంతకంతా బదులు తీర్చుకోవాలని డిసైడ్ అయ్యారు. ఫైనల్ మ్యాచ్ కావడంతో ఇదే ఆఖరి ఛాన్స్ కాబట్టి హర్షిత్ పని పట్టాలని జట్టు ఆటగాళ్లు అందరూ కసిగా ఉన్నారు.
ఈ సీజన్ మొదట్లో ఎస్ఆర్హెచ్-కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హర్షిత్ రాణా ఓవరాక్షన్ చేశాడు. మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేశాక సన్‌రైజర్స్ డగౌట్ వైపు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. మయాంక్‌ను కూడా అవమానించాడు. దీంతో అతడు దొరికితే బాదేయాలని ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఫిక్స్ అయ్యారు. మొన్న క్వాలిఫైయర్స్-1లో హర్షిత్ బౌలింగ్‌లో 4 ఓవర్లలో 27 పరుగులే చేశారు. ఆ మ్యాచ్‌లో మొదట్లోనే టాపార్డర్ బ్యాటర్లు ఔట్ అవడంతో రాణాను బాదడం కుదరలేదు. కానీ రేపు జరిగే ఫైనల్లో మాత్రం అతడికి బడితపూజ చేయాలని ఆరెంజ్ ఆర్మీ ఆటగాళ్లు అనుకుంటున్నారు. గెలవడంతో పాటు అతడి మీద రివేంజ్ కూడా తీర్చుకొని ఆనందాన్ని మరింత రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నారు. మరి.. ఎస్ఆర్హెచ్ రివేంజ్ స్టోరీపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
A flying kiss by Harshit Rana to Mayank Agarwal as a send off.pic.twitter.com/LVkQYKmisZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024
