Somesekhar
రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ SRH ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైయ్యాడు. మరి దానికి కారణం ఏంటి? ఇప్పుడు చూద్దాం.
రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ SRH ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైయ్యాడు. మరి దానికి కారణం ఏంటి? ఇప్పుడు చూద్దాం.
Somesekhar
ఐపీఎల్ లో భాగంగా నిన్న(గురువారం) రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. నరాలు తెగే ఉత్కంఠతతో సాగిన ఈ మ్యాచ్ లో కేవలం ఒక్క రన్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది సన్ రైజర్స్. చివర్లో బౌలర్లు అద్భుతంగా రాణించడంతో.. రాజస్తాన్ కు షాకిచ్చింది. అయితే ఈ మ్యాచ్ కు కామెంటేటర్ గా ఉన్న సునీల్ గవాస్కర్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి దానికి కారణాలు ఏంటో చూద్దాం.
సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్తాన్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన SRH టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో ట్రావిస్ హెడ్(58) మరోసారి అర్దసెంచరీతో ఆకట్టుకున్నాడు. హెడ్ తో పాటుగా నితీశ్ రెడ్డి(76*), క్లాసెన్(42*) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ టీమ్ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. 20 ఓవర్లు ఆడి 7 వికెట్లు నష్టానికి 200 పరుగులు చేసింది రాజస్తాన్.
ఇక ఇదంతా కాసేపు పక్కనపడితే.. ఈ మ్యాచ్ కు కామెంటేటర్ గా వ్యహరించిన టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ పై సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే? నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్ లో రనౌట్ అయినప్పటికీ.. రివ్యూలో థర్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. కానీ నెక్ట్స్ బాల్ కే హెడ్ ను బౌల్డ్ చేశాడు ఆవేశ్ ఖాన్. ఈ సమయంలో కామెంటేటర్ గా ఉన్న గవాస్కర్..”కర్మ తిరిగి వెంటాడింది” అని వ్యాఖ్యానించాడు. దీంతో ఓ ప్రముఖ వ్యాఖ్యతగా, ఓ ప్లేయర్ అవుట్ అయితే ఇలాగేనా మాట్లాడేది? మీ స్థాయికి తగ్గ మాటలు అవి కాదు.. అంటూ సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Your views?🤔#IPL2024 #SRHvsRR #TravisHead #SanjuSamson #CricketTwitter pic.twitter.com/SCmWZxIddM
— InsideSport (@InsideSportIND) May 2, 2024
#Travishead wicket #SRHvRR pic.twitter.com/HYVtzYrTND
— Surajpal Rathore (@TrendsWithSp) May 2, 2024