iDreamPost

Abdul Samad: టెస్టు క్రికెట్ ను టీ20 చేశాడు.. సన్ రైజర్స్ బ్యాటర్ సంచలన సెంచరీ!

ఫోర్లు, సిక్సర్లతో టెస్ట్ మ్యాచ్ ను కాస్త టీ20 చేశాడు సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆల్ రౌండర్ అబ్దుల్ సమద్. టీ20 రేంజ్ లో సంచలన శతకం బాదాడు ఈ స్టార్ ప్లేయర్.

ఫోర్లు, సిక్సర్లతో టెస్ట్ మ్యాచ్ ను కాస్త టీ20 చేశాడు సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆల్ రౌండర్ అబ్దుల్ సమద్. టీ20 రేంజ్ లో సంచలన శతకం బాదాడు ఈ స్టార్ ప్లేయర్.

Abdul Samad: టెస్టు క్రికెట్ ను టీ20 చేశాడు.. సన్ రైజర్స్ బ్యాటర్ సంచలన సెంచరీ!

ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024 సీజన్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లో టీమిండియా యువ ఆటగాళ్లు దుమ్మురేపుతూ.. ఎప్పుడెప్పుడు జాతీయ జట్టులోకి వస్తామా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ వర్సెస్ జమ్ము అండ్ కశ్మీర్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ యంగ్ బ్యాటర్ అబ్దుల్ సమద్ సంచలన సెంచరీతో అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఓవైపు సహచర ఆటగాళ్లు పెవిలియన్ కు క్యూ కడుతున్నా.. మధ్యప్రదేశ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు ఈ కశ్మీర్ బ్యాటర్. సిక్సులు, ఫోర్లుతో టెస్టు క్రికెట్ ను కాస్త టీ20 చేశాడు.

అబ్దుల్ సమద్.. గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు. స్థిరమైన ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్లేయర్ టీమ్ లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ 2024లో జమ్ము కశ్మీర్ టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక ఈ టోర్నీలో భాగంగా తాజాగా మధ్యప్రదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో అద్భుత శతకంతో చెలరేగాడు ఈ యువ ఆటగాడు. ఎంపీ బౌలర్ల ధాటికి 61 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఆలౌట్ అంచుల్లో ఉన్న టీమ్ ను 242 పరుగులకు చేర్చాడు అంటే అందులో సమద్ కృషి ఎంతో ఉంది. ఓవైపు వికెట్లు పడుతున్నా.. ఒత్తిడిని ఏ మాత్రం లెక్కచేయకుండా.. టెస్ట్ మ్యాచ్ ను కాస్త టీ20గా మార్చాడు.

ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగిన సమద్ కేవలం 71 బంతుల్లోనే శతకం బాదాడు. ఓవరాల్ గా 74 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 103 పరుగులు చేసి.. 9వ వికెట్ గా వెనుదిరిగాడు. సమద్ అన్ బీట్ బ్యాటింగ్ తో జట్టు 242 స్కోర్ సాధించింది. మిగతా బ్యాటర్లలో సాహిల్ లోత్రా(38), అబిద్ ముస్తాఖ్(35) పరుగులతో రాణించారు. ఇక ఈ మ్యాచ్ లో సమద్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఓవైపు పెవిలియన్ కు సహచరులు క్యూ కడుతున్నా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా.. ప్రత్యర్థి బౌలర్లను వణికించాడు ఈ ప్లేయర్. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 200 పరుగులకు ఆలౌట్ కాగా.. జమ్ము కశ్మీర్ టీమ్ 242 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. దీంతో జమ్ము టీమ్ కు 42 పరుగుల ఆధిక్యం లభించింది. మరి కేవలం 71 బంతుల్లో టీ20 రేంజ్ లో సెంచరీ బాదడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IND vs ENG: తన కంటిని తానే పొడుచుకుంటున్న ఇంగ్లండ్! అంతా బజ్​బాల్ మహిమే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి