iDreamPost

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఏకంగా ప్రభాస్ కు జోడీగా..

  • Author Soma Sekhar Published - 12:29 PM, Mon - 25 September 23
  • Author Soma Sekhar Published - 12:29 PM, Mon - 25 September 23
గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఏకంగా ప్రభాస్ కు జోడీగా..

శ్రీలీల.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన బ్యూటీ. దానికి కారణం ఆమె చేసే సనిమాలే. చిన్నా, పెద్ద సినిమాలు కలుపుకుని ఈ బ్యూటీ చేతిలో దాదాపు 9 సినిమాలు ఉన్నాయి. స్టార్ హీరోలతో పాటుగా యంగ్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేస్తూ.. ఇతర హీరోయిన్లకు సవాల్ విసురుతోంది ఈ వయ్యారి. ధమాకా మూవీ విడుదలకు ముందే ఈ ముద్దుగుమ్మ అరడజనుకు పైగా సినిమాను ఒకే చేసిందంటే.. శ్రీలీల క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ఈ బ్యూటీ మరో గొల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఈసారి ఏకంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లుగా సమాచారం. ఇంతకీ ఏ సినిమాలో ఈ అమ్మడు డార్లింగ్ కు జోడీగా నటిస్తుందో చూద్దాం.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు ప్రశాంత్ నీల్ తో సలార్, మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న కల్కి 2898ఏడీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీస్ అనంతరం కొన్ని సినిమాలను లైన్లో పెట్టాడు డార్లింగ్. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ‘డీలక్స్ రాజా’ సినిమా చేస్తుండగా.. తాజాగా మరో సినిమాను లైన్లో పెట్టినట్లు సమాచారం. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారని, కథకు సంబంధించిన చర్చలు పూర్తి అయ్యాయని కూడా తెలుస్తోంది. వరల్డ్ వార్ పీరియడ్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుందని టాక్.

కాగా.. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నడట హను రాఘవపూడి. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా యంగ్ సెన్సేషన్ శ్రీలీలను తీసుకున్నారని సమాచారం. దీంతో గోల్డెన్ ఛాన్స్ శ్రీలీల గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందని అందరూ అనుకుంటున్నారు. కాగా.. ఇప్పటికే శ్రీలీల చేతిలో దాదాపు 9 సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదీకాక డేట్లు సర్దుబాటు కాక ఇంకొన్ని సినిమాలు కూడా వదిలేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభాస్ తో సినిమా ఇప్పట్లో స్టార్ట్ కాదనే ఉద్దేశంతోనే ఈ బ్యూటీ డార్లింగ్ తో సినిమాకు ఓకే చెప్పిందని టాక్. మరి ప్రభాస్ కు జోడీగా శ్రీలీల నటిస్తే.. ఎలా ఉంటుందో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి