iDreamPost

ఆస్పత్రి సంచలన నిర్ణయం.. ఇకపై ICUలో దైవ భజనలు!

ఆస్పత్రి సంచలన నిర్ణయం.. ఇకపై ICUలో దైవ భజనలు!

సాధారణంగా గుళ్లలో ఉదయం పూటో.. సాయంత్రమో దేవుడి పాటలు పెడుతూ ఉంటారు. కానీ, ఆస్పత్రిలో దేవుడి పాటలు పెట్టడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అది కూడా ఐసీయూలో పాటలు పెట్టడం గురించి.. కచ్చితంగా విని ఉండరు. ఒరిస్సాలోని ఓ ఆస్పత్రి ఈ సంచలనం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఐసీయూలో భక్తి పాటలు పెట్టనుంది. ఆ పాటలు విని రోగుల ఆరోగ్యం మొరుగవుతుందని ఆస్పత్రి యజమాన్యం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒరిస్సాలోని కటక్‌లో ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ ఉంది. ఐసీయూలో భక్తి పాటలు పెడ్డటం ద్వారా రోగులు త్వరగా కోలుకుంటారని పేర్కొంటూ ఇక్కడి వైద్యులు అధికారులకు ఓ ప్రపోజల్‌ పంపారు. ఆ ప్రపోజల్‌కు అధికారులు ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరలో ఐసీయూలలో భక్తి పాటలు పెట్టనున్నారు. దీనిపై ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ వైస్‌ ఛాన్సలర్‌ అభినాష్‌ రౌత్‌ మాట్లాడుతూ.. ‘‘ఐసీయూలో వాయిద్య సంగీతం ప్లే చేయటం ద్వారా..

ఆ శబ్ధం రోగి ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుంది. ఆస్పత్రిలోని అన్ని ఐసీయూల్లో సంగీతం పెట్టాలని డిసైడ్‌ అయ్యాం. దాని బాధ్యతల్ని ఓ ప్రైవటే కంపెనీకి అప్పగించాం. ఆ కంపెనీ భక్తి పాటల్ని ఐసీయూల్లో ప్లే చేస్తుంది. ఇలా పాటలు పెట్టడం మ్యూజిక్‌ థెరపీలో ఓ భాగం’’ అని అన్నారు. ఇలా మ్యూజిక్‌ థెరపీ చేయటం ఇది మొదటి సారేం కాదు. 2020 కరోనా టైంలో.. గుజరాత్‌, వడోదరాలోని ఓ ఆస్పత్రి మ్యూజిక్‌ థెరపీని ఫాలో అయింది. ఈ మరి,  ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి