iDreamPost

ఆ ఆలయంలో పోలీస్ యూనిఫామ్‌‍కు నో ఎంట్రీ.. ఎందుకంటే..?

ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రభుత్వాలు భద్రత కల్పిస్తుంటాయి. తిరుమల, శ్రీశైలం వంటి పలు పుణ్యక్షేత్రాల్లో పోలీసుల భద్రత కల్పిస్తుంటారు. అలానే వివిధ ఆలయ అధికారులు తరచూ కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలానే ఓ ప్రముఖ పుణ్యక్షేత్ర అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రభుత్వాలు భద్రత కల్పిస్తుంటాయి. తిరుమల, శ్రీశైలం వంటి పలు పుణ్యక్షేత్రాల్లో పోలీసుల భద్రత కల్పిస్తుంటారు. అలానే వివిధ ఆలయ అధికారులు తరచూ కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలానే ఓ ప్రముఖ పుణ్యక్షేత్ర అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆ ఆలయంలో పోలీస్ యూనిఫామ్‌‍కు నో ఎంట్రీ.. ఎందుకంటే..?

దేశంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.  అందుకే దేవస్థాన అధికారులు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తుంటారు. అలానే వారి భద్రతకు పెద్ద పీఠ వేస్తుంటారు. ఈ క్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రభుత్వాలు భద్రత కల్పిస్తుంటాయి. తిరుమల, శ్రీశైలం వంటి పలు పుణ్యక్షేత్రాల్లో పోలీసుల భద్రత కల్పిస్తుంటారు. వారు యూనిఫామ్ లో విధులు నిర్వహిస్తుంటారు. అయితే ఓ గుడిలో మాత్రం పోలీసుల యూనిఫామ్ కి ఎంట్రీ లేదు అంట. ఆ ఆలయంలో విధులు నిర్వహించే పోలీసులకు ప్రత్యేక డ్రెస్ ఉంటుంది. మరి.. ఎందుకు అలా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కాశీ విశ్వనాథ స్వామి ఆలయం ఒకటి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆలయం ఉంది. ఇక్కడికి నిత్యం వేల సంఖ్యలలో భక్తులు వస్తుంటారు. ఇక్కడ పోలీసులు భద్రత విధులు నిర్వహిస్తుంటారకు. అయితే ఇక నుంచి ఖాకీ యూనిఫామ్స్ దుస్తులు ధరించడానికి వీల్లేదు. ఇప్పటి వరకు అన్నీ ఆలయా మాదిరిగానే ఇక్కడ పోలీస్ యూనిఫామ్ తో విధులు నిర్వహించే వారు. అయితే తాజాగా అక్కడ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి పోలీస్ యూనిఫామ్ లో విధులు నిర్వహించ కూడదు. పురుషులకు ధోతీ – షాల్, మహిళా పోలీసులకు శల్వార్ – కుర్తా అనే ప్రత్యేక యూనిఫామ్‌లను అందజేయనున్నారు. అలాగే గుడికి వచ్చే భక్తులతో స్నేహపూర్వకంగా నడుచుకునేలా పోలీసులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రద్దీ సమయంలో నో టచ్ పాలసీని అమలు చేయనున్నారు. అదే విధంగా దైవ దర్శనానికి వెళ్లే క్యూలైన్లను తాళ్లతోనే నియంత్రించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

కొంతకాలం క్రితం ఈ కాశీ విశ్వనాథ ఆలయంలో భద్రత విధులు నిర్వహించే పోలీసులపై అనేక రకాల ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆలయ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాశీ విశ్వనాథుడి గుడికి వచ్చే భక్తులకు  ఆధ్యాత్మిక వాతావరణం ఎక్కువ కల్పించేలా పోలీస్ దుస్తులకు.. ఆ శాఖ ఉన్నతాధికారులు గుడ్ బై చెప్పారు. పోలీస్ యూనిఫామ్ కారణంగా కలిగే ప్రతికూల అభిప్రాయాలను తొలగించేందుకు అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా, ఆలయంలో విధులు నిర్వర్తించే సమయంలో భక్తులతో ఫ్రెండ్లీగా ఎలా నడుచుకువాలనే విషయంలో పోలీసులకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఇక ఈ కీలక నిర్ణయాలపై  సిటి కమిషనర్ మోహిత అగర్వాల్ పలు విషయాలను వెల్లడించారు. దర్శనం కోసం భక్తులు పెద్ద క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు.

ఈ సమస్యను నివారించేందుకు రద్దీ నియంత్రణలో ప్రెండ్లీ విధానాలను అవలంబించేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఒరిస్సాలోని కాశీ విశ్వానాథుడి  ఆలయంలో గత రెండేళ్లల్లో భక్తుల రద్దీ బాగా పెరిగింది. ఇదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఫిర్యాదులూ పెరిగాయి. ఆలయ ప్రాంగణంలో భక్తుల పట్ల పోలీసులు దరుసుగా ప్రవర్తిస్తున్నారని అనేక మంది ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు మార్పులకు శ్రీకారం చుట్టారు. మరి.. ఈ ఆలయ అధికారులు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి