iDreamPost

డ్రైవర్‌ కాదు.. దేవుడు! తన ప్రాణం పోతున్నా.. 60 ప్రాణాలు కాపాడాడు!

  • Published Jan 31, 2024 | 1:37 PMUpdated Jan 31, 2024 | 5:08 PM

ఎదుటవారి ప్రాణలు పోతున్న అయ్యో పాపం అనుకున్న రోజుల్లో ఓ డ్రైవర్ మాత్రం తన కర్తవ్యన్ని మరువలేదు. విధిలో తనకు ఎదురైన సమస్యను లెక్క చేయకుండా చాలా పెద్ద సహసం చేశాడు. ఆ సహసమే ఇప్పుడు ఊహించని ప్రమాదం నుంచి బయటపడేసింది. అసలు ఏం జరిగిందంటే..

ఎదుటవారి ప్రాణలు పోతున్న అయ్యో పాపం అనుకున్న రోజుల్లో ఓ డ్రైవర్ మాత్రం తన కర్తవ్యన్ని మరువలేదు. విధిలో తనకు ఎదురైన సమస్యను లెక్క చేయకుండా చాలా పెద్ద సహసం చేశాడు. ఆ సహసమే ఇప్పుడు ఊహించని ప్రమాదం నుంచి బయటపడేసింది. అసలు ఏం జరిగిందంటే..

  • Published Jan 31, 2024 | 1:37 PMUpdated Jan 31, 2024 | 5:08 PM
డ్రైవర్‌ కాదు.. దేవుడు! తన ప్రాణం పోతున్నా.. 60 ప్రాణాలు కాపాడాడు!

‘మరణం’ ఇది ఎప్పుడు ఎలా పొంచి వస్తుందో ఎవరు ఊహించలేం. వచ్చిన మరణని ఎవరు అపలేరు. కానీ, చాలా వరకు మన కళ్లముందే ఎదుట వ్యక్తి ప్రాణాలు పోతున్న అయ్యో పాపం అనుకున్న వాళ్లు తప్ప సాయం చేసే వాళ్లు ఉండరు. మరి ప్రస్తుత కాలంలో అయితే మనిషి చావు బతుకుల మధ్య పోరాతు కాపాడమని ఆర్థిస్తున్న ఫోన్ లో ఫోటోలు, వీడియోలు తీసుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా మనుషులు ఎవరు స్వార్థంతో వాళ్లు బ్రతుకుతున్న రోజుల్లో.. ఓ బస్సు డ్రైవర్ మాత్రం తన కర్తవ్యన్ని మరువలేదు. ఎప్పటిలానే విధులను కొనసాగిస్తున్న ఆ డ్రైవర్ కి సడన్ గా ఆనారోగ్య సమస్య ఎదురైంది. అయిన అతడు తన ప్రాణాలను లెక్కచేయలేదు. తాను చనిపోతున్న అనే భయం కూడా లేదు. కానీ, ఎలా అయిన ఆ బస్సులో ఉండే ప్రయాణికులను కాపాడటమే తన లక్ష్యం అనుకున్నాడు. ఆ సమయంలో అతడు తన ప్రాణాల కోసం కాకుండా.. ఎదుటి వారి ప్రాణాల కోసం ఆలోచించక పోయుంటే పెద్ద ఘోరమే జరిగేది. అసలు ఏం జరిగిందంటే..

పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన పర్యాటకుల బస్సులోని ఓ డ్రైవర్ కు అకస్మత్తుగా గుండెపోటుకి గురయ్యైడు. దీంతో తన ప్రాణాలు పోతున్నా లెక్కచేయలేదు. ఆ బస్సలో ఉన్నవారి కోసమే ఆలోచించాడు. అలా ఆయన అప్రమత్తతో వ్యవహరించడంతో 60 మంది ప్రయాణికులు ప్రాణాలు నిలిచాయి. అయితే అందరు ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్ మాత్రం తన శ్వాసను విడిచాడు. ఇంతటి విషాదకరమైన ఘటన ఒడిశాలోని బాలాసోర్ వద్ద మంగళవారం జరిగింది. కాగా, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన పర్యాటకులతో ఓ ప్రయివేట్ బస్సు బాలాసోర్‌లోని పంచలింగేశ్వరాలయానికి వెళ్తోంది. కాగా, మార్గమధ్యలో దానిని నడుపుతోన్న డ్రైవర్‌ షేక్ అక్తర్‌ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో తన ప్రాణాలు పోతున్నా లెక్కచేయకుండా.. బస్సులో ఉన్నవారి కోసమే ఆలోచించాడు. అలా స్టీరింగ్ వదిలిపెట్టకుండా బస్సును ఎంతో చాకచక్యంగా పక్కకు తీసి నిలిపివేశాడు. అనంతరం అతడు స్పృహ కోల్పోయాడు.

దీంతో ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయందోళనకు గురై సాయం కోసం కేకలు వేవారు. అలా ప్రయాణికులు అరుపులు విన్న స్థానికుల వచ్చి అక్తర్ ను చికిత్స కోసం దగ్గరలో ఉన్నఆసుపత్రిలో చేర్పించారు. వెంటనే వైద్యులు పరీక్షించి చూడగా అప్పటికే అతడు మృతిచెందినట్టు ధ్రవీకరించారు. అయితే డ్రైవర్ ప్రాణప్రయ స్థితిలో ఉన్నప్పటికి ప్రయాణికుల కోసం అలోచించి తన ప్రాణాలను త్యాగం చేయడంతో ఆ బస్సులో ప్రయాణికులు కంటతడి పెట్టారు. ఇలా ప్రయాణికుల కోసం తన ప్రాణాలను విడిచిన గొప్ప వ్యక్తిని స్థానికులంతా అభినందిస్తున్నారు. ఒకవేళ బస్సును అలాగే వదిలేసి ఉంటే ఘోరమైన నష్టం జరిగేదని తలచుకున్నారు. మరి, తన ప్రాణాలను లెక్క చేయకుండా, 60 మంది ప్రయాణికులను కాపాడిన డ్రైవర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి