iDreamPost

రోజుకు రూ.250 సంపాదించే కూలీ.. నేడు నెల ఆదాయం రూ.3 లక్షలు ఎలా అంటే.?

  • Published Feb 16, 2024 | 6:35 PMUpdated Feb 16, 2024 | 6:35 PM

ఒక సాధరణ కూలీ పని చేస్తూ జీవనం గడిపే వ్యక్తి నేడు పెద్ద వ్యాపారవేత్తగా మారాడు. నిజంగా ప్రయత్నిస్తే సాధించనదంటూ ఏది లేదని నిరూపించాడు. ఇంతకి అతనేవరంటే..

ఒక సాధరణ కూలీ పని చేస్తూ జీవనం గడిపే వ్యక్తి నేడు పెద్ద వ్యాపారవేత్తగా మారాడు. నిజంగా ప్రయత్నిస్తే సాధించనదంటూ ఏది లేదని నిరూపించాడు. ఇంతకి అతనేవరంటే..

  • Published Feb 16, 2024 | 6:35 PMUpdated Feb 16, 2024 | 6:35 PM
రోజుకు రూ.250 సంపాదించే కూలీ.. నేడు నెల ఆదాయం రూ.3 లక్షలు ఎలా అంటే.?

ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, ఒడిదుడుకులు అనేవి కామన్ గా ఉంటాయి. కానీ, వాటిని అధిగమించడానికి మనిషి చేసే ఉన్నత ప్రయత్నం డబ్బు సంపాదించడం. ఎందుకంటే రోజు గడవాలన్నా, కడుపు నిండాలన్నా డబ్బు అనేది ముఖ్యం. మరి దీనిని సంపాదించడానికి చాలా మంది విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా రకరకాల కూలీ పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తు జీవనం సాగించే వారి బ్రతుకుల్లో కోవిడ్ మహమ్మారి దాపరించింది. దీనివల్ల దేశంలో ఎంతోమంది తమ ఉపాధిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఒడిశాకు చెందిన ఇసాక్ ముండా అనే కూలి కూడా.. ఈ కోవకు చెందినవాడే. అతనికి కూలి పనులు తప్ప మరేమీ తెలియదు. తన భార్యాబిడ్డలను పోషించడమే అతనికి కష్టంగా ఉండేది.

2020లో వచ్చినా కోవిడ్ 19 కారణంగా.. ఇసాక్ తన కూలి పనిని కోల్పోవడంతో పాటు.. వారి జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోయాయి. దీంతో కుటుంబ భారాన్ని మోయడమే సవాలుగా మారింది. దీంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ముంబై తదితర ప్రాంతాల్లో కూలి పని కోసం తిరిగాడు. కానీ, ఆయనకు కరోనా మహమ్మారి కారణంగా ఎక్కడా ఉపాధి దొరకలేదు. ఇసాక్ కు ఉచిత రేషన్ తప్ప మరే ఆధారం లేదు. అలాంటి వ్యక్తి నేడు ప్రతి నెలా 3 లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగాడు. నిజంగా ప్రయత్నిస్తే సాధించనదంటూ ఏమీ లేదని ఇసాక్ నిరూపించాడు.

కేవలం ఒక కూలీగా మొదలుపెట్టిన ఆయన ప్రయాణం నేడు ఒక బడా వ్యాపారవేత్తగా ఎదిగాడు. పని లేకుండా ఖాళీగా ఉన్న ఇసాక్.. ఇంట్లోనే ఉండి యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉందని తెలుసుకున్నాడు. కానీ యూట్యూబ్ లో వీడియోస్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దానిపై అతనికి పెద్దగా అవగాహన లేదు. దీంతో గ్రామానికి చెందిన కొంతమంది యువకులను సంప్రదించి వాటి వివరాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత 2020లో ఇసాక్ ముండా ఓ యూట్యూబ్ ఛానెల్‌ ని ప్రారంభించాడు. ఈ క్రమంలోనే అతడికి మొదట యూట్యూబ్ ఛానెల్‌ లో ఏ ఏ వీడియోను పోస్ట్ చేయాలనే సందేహం తలెత్తింది.

అప్పుడే ఇసాక్ తనకు తెలిసిన ఒడిశా సంప్రదాయ వంటల గురించి వీడియో తీయాలని నిర్ణయించుకున్నాడు. కానీ, అతనికి కెమెరా ముందు ఎలా మాట్లాడాలనేది ఏమీ తెలియదు. అయినా కానీ ప్రయత్నించేవాడు. మొదట ఇసాక్ వీడియోలను పెద్దగా ఎవరూ చూడలేదు. ఏ వీడియోకి లైక్స్, వ్యూస్ రాలేదు. అయినా ఇసాక్ తన ప్రయత్నాన్ని వదల్లేదు. ఒడిశా సంప్రదాయ ఆహారాన్ని వండుతున్న వీడియోను తన మొబైల్ ఫోన్ ద్వారా రికార్డ్ చేసి పోస్ట్ చేసేవాడు. దీంతో నెమ్మదిగా ఆ వీడియోలకు లైక్‌ లు, వ్యూస్ రావడం ప్రారంభించాయి. తాను పెట్టిన వీడియోలకు డబ్బు రాకపోయినా.. ఇసాక్ ప్రయత్నం ఆపలేదు. అలా ‘బాసి పాఖాలా’ అనే ఒడియా వంటకం ఇసాక్ ముండా దశను మార్చేసింది. ఈ వీడియో వైరల్‌ గా మారింది. బ్రెజిల్, అమెరికా, మంగోలియాతో సహా పలు దేశాల్లో ఈ వీడియోకు భారీ వీక్షణలను వచ్చాయి. 

దీంతో యూట్యూబ్ వీడియోలు మిలియన్ల కొద్దీ వీక్షణలను పొందుతూ.. ఆదాయం మొదలైంది. ప్రస్తుతం ఇసాక్ ముండా తన యూట్యూబ్ ద్వారా ప్రతి నెలా కనీసం 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అలాగే.. తన వీడియోలను చిత్రీకరించడానికి కెమెరా, ల్యాప్‌ టాప్‌ ను కొనుగోలు చేశాడు. అంతేకాకుండా సెకండ్ హ్యాండ్ కారును కూడా కొన్నాడు. తాను, తన కుటుంబం ఇలాంటి జీవితం గడుపుతామని కలలో కూడా ఊహించలేదని సంతోషం వ్యక్తం చేశాడు. కాగా ఇసాక్ ముండా విజయగాథ అందరికీ స్ఫూర్తిదాయకం అని ‘మన్ కీ బాత్‌’ లో ప్రధాని మోదీ ప్రస్తావించి ప్రశంసించారు. మరి, కూలి పనులు చేసుకుంటే తప్ప జీవించలేని సమయంలో కరోనా మహమ్మారి చీకట్లు కమ్మేసినా సూర్యుడిలా చీకట్లను చీల్చుకుంటూ మరీ లక్షలు సంపాదించే స్థాయికి ఒక సాధారణ కూలోడు ఎదిగిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో  తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి