iDreamPost
android-app
ios-app

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాలకు వచ్చేది ఎప్పుడంటే?

South West Monsoon- Kerala- IMD: కేరళను నైరుతి రుతుపవనాలు తాకిన విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు ఎప్పుడు రాబోతున్నాయి అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు.

South West Monsoon- Kerala- IMD: కేరళను నైరుతి రుతుపవనాలు తాకిన విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు ఎప్పుడు రాబోతున్నాయి అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు.

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాలకు వచ్చేది ఎప్పుడంటే?

గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు భానుడి భగ భగలకు అల్లాడిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ ఎండాకాలం అయిపోతుందా అని ఎదురు చూస్తున్న వారికి వాతావరణ శాఖ అధికారులు ఒక శుభవార్త అందించారు. తాజాగా నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్, కేరళను తాకినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ నైరుతి రుతుపవనాల కదలికలు ఉన్నట్లు గుర్తించామన్నారు. అంటే వర్షాలు కురిసే అవకాశం దగ్గర్లోనే ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరుతున్న వేళ వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు చల్లని కబురు అందించారు.

మన దేశంలో ఇప్పటికీ 40 శాతం దిగుబడి వచ్చే భూములకు రుతుపవనాల ద్వారా కురిసే వర్షాలే ఆధారం. అంటే దేశంలో ఉన్న 52 శాతం నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారంగా ఉంది. ఈసారి వర్షాలు బాగానే కురిసే అవకాశం ఉందని అధికారులు ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే 1951 నుంచి 2023 వరకు ఎల్ నినో వచ్చిన తర్వాత లానినో వచ్చిన సందర్భాల్లో వర్షాలు బాగా కురిశాయని చెప్పారు. 9 సార్లు అలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయని వెల్లడించారు. అందుకే ఈసారి కూడా మంచి వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ సీజన్లో వర్షాలు అధికంగానే ఉంటాయని ఐఎండీ గత నెలలోనే వెల్లడించింది. ఈ ఏడాది లానినా అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా భూమధ్య రేఖ వద్ద పసిఫిక్ మహా సముద్రం చల్లబడడం ఆగస్టు- సెప్టంబర్ నెలనాటికి ప్రారంభమవుతుందని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఈసారి వర్షాలు అధికంగా ఉంటాయని చెబుతున్నారు. ఈసారి ఈశాన్య, వాయవ్య, తూర్పు రాష్ట్రాల్లో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో అధిక వర్షపాతమే నమోదు అవుతుందని స్పష్టం చేశారు. ఇంకా ఈ నైరుతి రుతుపవనాలు మరో నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు:

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఇంకో రెండ్రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలాగే ఉండబోతోందని అధికారులు స్పష్టం చేశారు. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలి అన్నారు. ఇప్పుడు కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు మరో నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశిస్తాయి. ఆ తర్వాత త్వరగానే వర్షాలు కురుస్తాయి. గతంలో అధికారులు చెప్పినట్లుగా జూన్ రెండో వారం నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం ప్రారంభం అవుతుంది. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి