iDreamPost

మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్..142 రైళ్లు రద్దు! ఏ ఏ ట్రైన్స్ అంటే..

Michaung Cyclone: మిచౌంగ్ తుఫాన్ తీవ్ర రూపం దాల్చుతోంది. సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో 142 రైళ్లు రద్దయ్యాయి. ఆ వివరాలు..

Michaung Cyclone: మిచౌంగ్ తుఫాన్ తీవ్ర రూపం దాల్చుతోంది. సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో 142 రైళ్లు రద్దయ్యాయి. ఆ వివరాలు..

మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్..142 రైళ్లు రద్దు! ఏ ఏ ట్రైన్స్ అంటే..

బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ తుఫాన్ కోస్తావైపు కదులుతున్నట్టు వాతావరణశాఖ ప్రకటించింది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్‌ పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళా ఖాతం లో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాన్ సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం లోపు నెల్లూరు,మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఇక తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలను, మత్స్యకారులను జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కోస్తా, రాయలసీమలో సోమ మంగళవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ ప్రకటించింది. ఈ క్రమంలో ఆప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

మిచౌంగ్ తుఫాన్ ప్రభావం రైళ్లపై పడింది.  ఈ తుపాను నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే విభాగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో దాదాపు 142 రైళ్లను రద్దు చేస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 3వ తేదీ నుంచి 6 తేదీ వ‌ర‌కూ ఈ రైలు స‌ర్వీసులు ర‌ద్దు చేసినట్టు సీపీఆర్‌వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం…ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్ప‌డిన తీవ్ర అల్ప పీడ‌నం శుక్ర‌వారం వాయుగుండంగా మారింది.

మిచౌంగ్ తుఫాన్ ఆదివారానికి తుపానుగా బ‌ల ప‌డింది. దీంతో నేడు, మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయి. అలానే మరికొన్ని ప్రాంతాల్లో తేలిక‌పాటి జ‌ల్లుల నుంచి మోస్తరు వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించి.., మంగళవారం ఉదయం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముంది.

ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులను దక్షిణ మ‌ధ్య రైల్వే (ఎస్సీఆర్‌) హెచ్చరిక జారీ చేసింది. మిచాంగ్ తుపాన్ తీరాన్ని దాటనున్న నేప‌థ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే ప‌రిధిలో తిరిగే 142 రైళ్లు ర‌ద్దు చేశామ‌ని సీపీఆర్‌వో సీహెచ్ రాకేశ్ చెప్పారు. ఈ నెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వ‌ర‌కూ ఈ రైలు స‌ర్వీసులు ర‌ద్దు చేశామ‌ని, ప్రయాణికులు గ‌మ‌నించాల‌ని కోరారు. మరికొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.

ఆ రైలు ఏమింటే.. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో నడిచే రైళ్లను  రద్దు చేసినట్లు తెలుస్తోంది. అలానే  ఒక మోస్తారు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో తిరిగే కొన్ని రైళ్లును పాక్షికంగా రద్దు చేశారు. ఏది ఏమైనా ప్రయాణించే ముందు రైళ్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం మంచిదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి.. తుఫాన్ ప్రభావం కారణంగా 142 రైళ్లు రద్దు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి