iDreamPost

భారత్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ రద్దు

భారత్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ రద్దు

దేశంలో 81 కరోనా కేసులు బయటపడిన నేపథ్యంలో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టింది.. కర్ణాటక వ్యక్తి హైదరాబాద్ హాస్పిటల్ లో కరోనా వైరస్ తో మృతి చెందడంతో వారం పాటు రేపటి నుంచి వారం రోజులపాటు మాల్స్‌, థియేటర్లు, పాఠశాలలు‌, కాలేజీలు బంద్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. వివాహాలు, క్రీడా పోటీలు, సదస్సులు వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా నడుస్తాయని యడియూరప్ప స్పష్టం చేశారు.

కాగా దక్షిణాఫ్రికాతో జరగాల్సిన వన్డే సిరీస్ సిరీస్ ని రద్దు చేస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇప్పటికే మొదటి వన్డే వర్షం కారణంగా రద్దుకాగా మిగిలిన రెండు వన్డేలను కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.ఈ నెల 15న లక్నోలో రెండో వన్డే, 18న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో చివరి వన్డే జరగాల్సి ఉంది. ఇప్పటికే ఈ నెల 29 న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ ను ఏప్రిల్ 15 కి వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న తెలిసిందే.

ఢిల్లీలో ఈ నెల 31 వరకు విద్యా సంస్థలు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్ ఘడ్, ఉత్తరాఖండ్ లో ఈ నెల 31 వరకూ స్కూల్స్ & కాలేజీలు కరోనా కారణంగా మూతపడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ పొట్టి శ్రీరాములు నెల్లూరులో థియేటర్లు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.

సుప్రీంకోర్టు కూడా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అత్యవసర కేసులు మాత్రమే విచారించాలని సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

ఏప్రిల్ 30 వరకు ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, శ్రీలంక దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేయాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ఇప్పటికే కువైట్‌కు తన విమాన సర్వీసులను నిలిపివేసిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి