iDreamPost

Sanju Samson: అప్పుడు రాయుడుకు జరిగిందే ఇప్పుడు సంజూకు.. BCCI వల్ల కెరీర్ క్లోజ్!

  • Published Apr 29, 2024 | 5:02 PMUpdated Apr 29, 2024 | 5:02 PM

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడుకు అప్పట్లో జరిగిన దాన్ని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. అదే ఇప్పుడు సంజూ శాంసన్ విషయంలోనూ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది.

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడుకు అప్పట్లో జరిగిన దాన్ని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. అదే ఇప్పుడు సంజూ శాంసన్ విషయంలోనూ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది.

  • Published Apr 29, 2024 | 5:02 PMUpdated Apr 29, 2024 | 5:02 PM
Sanju Samson: అప్పుడు రాయుడుకు జరిగిందే ఇప్పుడు సంజూకు.. BCCI వల్ల కెరీర్ క్లోజ్!

క్రికెటర్ల గురించి చాలా మంది ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్లకు ఏం తక్కువ? లగ్జరీ లైఫ్, కోరుకున్నది క్షణాల్లో వచ్చేస్తుందని భావిస్తుంటారు. కానీ అదంత ఈజీ కాదు. అందులోనూ క్రికెట్​లో ఫుల్ కాంపిటీషన్ ఉన్న భారత్​లో అస్సలు కాదు. ఇక్కడ ప్లేయర్​గా సక్సెస్​ఫుల్ కెరీర్​ను చూడటం చాలా కష్టం. టీమిండియాలోకి ఎందరో క్రికెటర్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొందరు మాత్రమే జట్టు తరఫున నిలకడగా ఆడుతూ వరల్డ్ కప్స్ లాంటి మెగా టోర్నీల్లోనూ టీమ్​లో భాగమవుతారు. అయితే కొందరు అన్​లక్కీ ప్లేయర్స్​కు ఆ ఛాన్స్ ఉండదు. ఎంత టాలెంట్ ఉన్నా విధి రాసిన రాతలో బలి అవుతారు. ఇప్పుడు సంజూ శాంసన్ పరిస్థితి కూడా ఇంచుమించుగా అలాగే ఉంది.

జూన్ 2వ తేదీ నుంచి టీ20 ప్రపంచ కప్ పండుగ మొదలవనుంది. దీంతో ఈ టోర్నీలో ఆడే జట్లను దేశాలు ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నాయి. మరో మూడ్నాలుగు రోజుల్లో టీమిండియా వరల్డ్ కప్ స్క్వాడ్ గురించి కూడా అనౌన్స్​మెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి టీమ్​లో వికెట్ కీపర్ పొజిషన్​కు గట్టి కాంపిటీషన్ ఉంది. రీఎంట్రీలో అదరగొడుతున్న రిషబ్ పంత్​తో పాటు సీరియర్ ప్లేయర్ దినేష్ కార్తీక్, సంజూ శాంసన్ ఈ పొజిషన్ కోసం రేసులో ఉన్నారు. స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా ఈ స్థానం కోసం పోటీపడుతున్నాడు. అయితే వికెట్ కీపర్ రేసులో నుంచి సంజూను పక్కనబెట్టారని వినిపిస్తోంది. డొమెస్టిక్ క్రికెట్​తో పాటు భారత జట్టు తరఫున బాగా ఆడుతూ, అలాగే ఐపీఎల్​లోనూ బ్యాట్​తో రఫ్ఫాడిస్తున్న శాంసన్​ను పక్కనబెట్టడం ఏంటనే కామెంట్స్ వస్తున్నాయి.

Samson

మాజీ బ్యాటర్ అంబటి రాయుడులాగే సంజూ కెరీర్​ను మధ్యలోనే ఫినిష్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పుడు రాయుడుకు జరిగిందే ఇప్పుడు శాంసన్​కూ జరుగుతోందని.. బీసీసీఐ మిస్టేక్స్ వల్ల అతడు బలిపశువు అయ్యాడని అంటున్నారు. 2019 వరల్డ్ కప్​ టైమ్​లో రాయుడు పీక్ ఫామ్​లో ఉన్నాడు. బ్యాట్​తో పరుగుల వరద పారిస్తున్నాడు. అయినా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్​లో రాణించే త్రీ డైమెన్షన్ ప్లేయర్ కావాలంటూ విజయ్ శంకర్​ను తీసుకున్నారు సెలెక్టర్లు. తీరా చూస్తే అతడు టోర్నీలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.

వరల్డ్ కప్ కోసం ఎంతో కష్టపడినా ఛాన్స్ మిస్సవడంతో రాయుడు తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. ఇప్పుడు దీన్నే సంజూ ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు. ఐపీఎల్-2024లో సంజూ ఫుల్ స్వింగ్​లో ఉన్నాడు. 9 మ్యాచుల్లో 385 రన్స్​తో ఆరెంజ్ క్యాప్ లిస్ట్​లో నాలుగో ప్లేస్​లో ఉన్నాడు. అలాంటోడ్ని ఎలాగైనా ప్రపంచ కప్​లో ఆడించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. దయచేసి అతడ్ని బలి చేయొద్దని కోరుతున్నారు. అయితే బీసీసీఐ అఫీషియల్​గా టీమ్ అనౌన్స్​మెంట్ చేసేవరకు సంజూ స్క్వాడ్​లో ఉంటాడా? లేదా? అనేది చెప్పలేం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి