iDreamPost

Supreme Court: భార్య కట్నంపై భర్తకు హక్కు లేదు.. కీలక తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు!

పెళ్లి అంటే.. వరుడుకి వధువు తరపు వారు వరకట్నం ఇస్తుంటారు. అయితే ఆ కట్నంపై భర్త పెత్తనం చేస్తుంటారని చాలా మంది అభిప్రాయా పడుతుంటారు. తాజాగా అదే అంశంపై  సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

పెళ్లి అంటే.. వరుడుకి వధువు తరపు వారు వరకట్నం ఇస్తుంటారు. అయితే ఆ కట్నంపై భర్త పెత్తనం చేస్తుంటారని చాలా మంది అభిప్రాయా పడుతుంటారు. తాజాగా అదే అంశంపై  సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

Supreme Court: భార్య కట్నంపై భర్తకు హక్కు లేదు.. కీలక తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు!

ఇటీవల కాలంలో కుటుంబ వ్యవహారాల్లో కోర్టులు సంచలన తీర్పులు ఇస్తున్నాయి.  ఫ్యామిలీ ఇష్యూస్ కారణంగా నిత్యం వందల కేసులు కోర్టుల ముందుకు విచారణకు వస్తుంటాయి. ఈ సందర్భంలో న్యాయస్థానాలు సుదీర్ఘంగా విచారణ చేసి.. కీలకమైన తీర్పులు ఇస్తుంటాయి. ఇలాంటి తీర్పుల్లో కొన్ని భర్తలకు అనుకూలంగా ఉండగా, మరికొన్ని భార్యలకు అనుకూలంగా ఉంటాయి. గతంలో భార్యకు భరణం ఇచ్చే విషయంలో భర్తకు ఊరటగా ఓ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా భార్య తీసుకొచ్చే విషయంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మరి… ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా పెళ్లి అంటే వివిధ రకాల పద్ధతులు, సాంప్రదాయాలు ఉంటాయి. అలానే అమ్మాయి తరుపు, అబ్బాయి తరపు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. అయితే అనాధికారికంగా వరకట్నం అనేది కూడా ఉంది. పెళ్లి అంటే.. వరుడుకి వధువు తరపు వారు వరకట్నం ఇస్తుంటారు. అయితే ఆ కట్నంపై భర్త పెత్తనం చేస్తుంటారని చాలా మంది అభిప్రాయా పడుతుంటారు. తాజాగా అదే అంశంపై  సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భార్య స్త్రీ నిధి పై భర్తకు హక్కు ఉండదని తేల్చి చెప్పింది. ఒకవేళ ఏదైనా ఆపద సమయంలో దానిని ఉపయోగించినప్పటికీ, భార్యకు తిరిగి ఇచ్చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓ కేసుపై గురువారం విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం మహిళ కోల్పోయిన బంగారానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆమె భర్తను ఆదేశించింది.

కేరళకు చెందిన ఓ మహిళ తనకు పుట్టింటివారు ఇచ్చిన 89 గ్రాములు బంగారాన్ని పెళ్లి సమయం లో తీసుకొచ్చింది. అయితే భర్త తన అవసరాల మేరకు ఆ మహిళ తీసుకొచ్చిన బంగారాన్ని వాడుకున్నారని ఆరోపిస్తూ ఫ్యామిలీ కోర్టును  ఆమె ఆశ్రయించింది. పెళ్లైన మరసటి రోజే తన భర్త తన సొమ్మును తీసుకుని ఆయన తల్లికి అందజేశాడని, ఎందుకు ఇచ్చావని ప్రశ్నిస్తే.. జాగ్రత్త పర్చడానికి అని చెప్పాడని ఆరోపిచింది. అంతేకాక తన సొమ్ము తీసుకోవడం ద్వారా తన హక్కుల్ని పూర్తిగా లాక్కున్నారని ఆమె ఆరోపించింది. తన నగలను అప్పటికే అత్తింటి వారు ఉన్న అప్పులు కట్టడానికి వినియోగించారని ఆమె తెలిపింది.

ఆ సొమ్ము గురించి అడిగితే భర్త, అత్త బెదిరించేవారని 2011లోనే  కుటుంబ న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. భర్త చేసింది తప్పేనంటూ ఫ్యామిలీ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ భర్త హైకోర్టు మెట్లు ఎక్కాడు. అక్కడ అతడి అనుకూలంగా తీర్పు రావడంతో ఆ భార్య సుప్రీం కోర్టు తలుపు తట్టింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం విచారించి తీర్పు వెలువరించారు.

ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వధువు తెచ్చే కట్నం ఉమ్మడి ఆస్తి రాదని, ఆమెకు సంబంధించిన ఆస్తి, నగలు, ధనాన్ని భర్త ఏ అవసరానికి వాడుకోరాదని వ్యాఖ్యానించింది ఒకవేళ వాడుకున్న పక్షంలో వాటిని తప్పనిసరిగా ఆమెకు తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసింది. వివాహ బంధాలకు సంబంధించిన విషయాలను సూటిగా చెప్పలేమని అంటూ, బంగారాన్ని వాడుకుని తిరిగి ఇవ్వనందుకు భర్త రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని ధర్మాసనం పేర్కొంది. మరి.. సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి