iDreamPost
android-app
ios-app

హార్ధిక్‌ పాండ్యాకు షాక్‌..! రోహిత్‌ శర్మకు అండగా గంగూలీ!

  • Published Feb 20, 2024 | 1:57 PM Updated Updated Feb 20, 2024 | 6:17 PM

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సూపర్‌ సక్సెస్‌ అవుతున్నాడు. వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్‌ వరకు వెళ్లడం, తాజాగా ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో విజయాలు, అంతకు ముందు ఆసియా కప్‌ విజయం.. ఇలా రోహిత్‌ కెప్టెన్సీకి మంచి మార్కులే పడ్డాయి. అయినా కూడా రోహిత్‌కి వ్యతిరేకంగా కొన్ని పనులు జరిగాయి. ఈ నేపథ్యంలో దాదా.. రోహిత్‌కు అండగా నిల్చున్నాడు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సూపర్‌ సక్సెస్‌ అవుతున్నాడు. వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్‌ వరకు వెళ్లడం, తాజాగా ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో విజయాలు, అంతకు ముందు ఆసియా కప్‌ విజయం.. ఇలా రోహిత్‌ కెప్టెన్సీకి మంచి మార్కులే పడ్డాయి. అయినా కూడా రోహిత్‌కి వ్యతిరేకంగా కొన్ని పనులు జరిగాయి. ఈ నేపథ్యంలో దాదా.. రోహిత్‌కు అండగా నిల్చున్నాడు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 20, 2024 | 1:57 PMUpdated Feb 20, 2024 | 6:17 PM
హార్ధిక్‌ పాండ్యాకు షాక్‌..! రోహిత్‌ శర్మకు అండగా గంగూలీ!

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు, భారత దిగ్గజ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ మద్దతుగా నిలబడ్డాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైన తర్వాత.. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్‌ శర్మ, ఇక టీ20 ఫార్మాట్‌కు పూర్తిగా దూరం అవుతాడని అతని స్థానంతో టీమిండియాకు కొత్త టీ20 కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యాను పర్మినెంట్‌ చేస్తారనే ప్రచారం కూడా సాగింది. ఎందుకంటే.. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 కంటే ముందుకు జరిగిన చాలా టీ20 మ్యాచ్‌ల్లో పాండ్యానే భారత కెప్టెన్‌గా వ్యవహరించాడు. వన్డే వరల్డ్‌ కప్‌ కోసం వన్డేలపై ఎక్కువ ఫోకస్‌ పెట్టేందుకు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ లాంటి స్టార్లు టీ20లకు దూరంగా ఉన్నారు. దీంతో రోహిత్‌ టీ20లకు దూరం అవుతాడని అంతా భావించారు.. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించి పాండ్యాను నియమించింది ఆ టీమ్‌ మేనేజ్‌మెంట్‌.

ఇలా రోహిత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న వరుస ఘటనల నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోనే టీమిండియా పాల్గొంటుందని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ సైతం రోహిత్‌ శర్మకు మద్దతుగా నిలిచాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024కు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఎంపిక సరైందని దాదా పేర్కొన్నాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అతను జట్టు నడిపి తీరును ఎవరూ మర్చిపోలేరని, జట్టు వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిచిందని, అందుకే టీమిండియాను నడిపించడానికి రోహిత్‌ శర్మ బెస్ట్‌ ఛాయిస్‌ అని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

ఐదు సార్లు ముంబైని ఛాంపియన్‌గా నిలిపిన తర్వాత కూడా జట్టు కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంపై రోహిత్‌ అసంతృప్తిగానే ఉన్నాడు. ఆ విషయంపై రోహిత్‌ స్పందించకపోయినా.. అతని భార్య రితికా మాత్రం రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై రియాక్ట్‌ అయింది. అలాగే టీమిండియా టీ20 కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పిస్తారనే వార్తల నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్‌గా, బీసీసీఐ మాజీ అధ్యక్షుడిగా గంగూలీ, రోహిత్‌కు అండగా నిలబడటంపై క్రికెట్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి దాదా.. రోహిత్‌కు అండగా నిలబడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.