iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్ లో ఆ స్టార్ ప్లేయర్ ఫామ్ పై ఆందోళన వద్దు.. ఇరగదీస్తాడు నో డౌట్: గంగూలీ

  • Published May 14, 2024 | 12:15 PM Updated Updated May 14, 2024 | 12:15 PM

టీ20 వరల్డ్ కప్ లో ఆ స్టార్ ప్లేయర్ ఫామ్ పై ఆందోళన వద్దు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు భారత దిగ్గజం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.

టీ20 వరల్డ్ కప్ లో ఆ స్టార్ ప్లేయర్ ఫామ్ పై ఆందోళన వద్దు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు భారత దిగ్గజం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.

  • Published May 14, 2024 | 12:15 PMUpdated May 14, 2024 | 12:15 PM
వరల్డ్ కప్ లో ఆ స్టార్ ప్లేయర్ ఫామ్ పై ఆందోళన వద్దు.. ఇరగదీస్తాడు నో డౌట్: గంగూలీ

ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ జరుగుతున్నప్పటికీ.. అందరి దృష్టి మాత్రం జూన్ లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ పైనే ఉంది. జూన్ 2 నుంచి ఆరంభం అవ్వబోతున్న ఈ మెగాటోర్నీ కోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం టీమిండియా తన జట్టును కూడా ప్రకటించింది. ఇక టీమిండియా సెలెక్షన్ పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. టాలెంటెడ్ ప్లేయర్లకు అన్యాయం చేశారని కొందరు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఓ టీమిండియా ఆటగాడి ఫామ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సౌరవ్ గంగూలీ.

రోహిత్ శర్మ.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. ఈ సీజన్ లో ఓ సెంచరీ చేసినప్పటికీ.. ఆ తర్వాత దారుణంగా విఫలం అవుతున్నాడు. దాంతో వరల్డ్ కప్ కు ఇంకా కొన్ని రోజులే ఉండటం, రోహిత్ ఇలా విఫలం అవ్వడం టీమిండియా శిబిరంలో ఆందోళన రేకేత్తిస్తోంది. రోహిత్ ఫామ్ భారత్ కు పెద్ద దెబ్బే అని క్రీడా నిపుణులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హిట్ మ్యాన్ ఫామ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్ శర్మ ఫామ్ పై గంగూలీ స్పందిస్తూ..”వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఫామ్ పై అందరూ ఆందోళన పడుతున్నారు. ప్రస్తుతం అతడు ఐపీఎల్ లో ఆడుతున్న తీరును బట్టి వారు ఇలా అనుకుంటున్నారు. కానీ రోహిత్ వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీల్లో దుమ్మురేపుతాడు.. అందులో ఎలాంటి సందేహం లేదు. మెగాటోర్నీల్లో రాణించడం అతడికి అలవాటు. ఇందులో మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోనవసరం లేదు. రోహిత్ రాణిస్తాడు అంతే”  అంటూ హిట్ మ్యాన్ ఫామ్ పై మాట్లాడాడు. మరి రోహిత్ ఫామ్ పై గంగూలీ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş