iDreamPost

హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతున్నయువతి.. సెలవుల్లో ఇంటికి వచ్చి..!

Vikarabad District: ప్రతి తల్లిదండ్రులు  తమ బిడ్డలను బాగా చదివించాలనే భావిస్తుంటారు.  అలానే రవి అనే కార్మికుడు కూడా తమ బిడ్డను బాగా చదవించాలని రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ క్రమంలో సెలవుల్లో ఇంటికి వచ్చిన ఆ బాలిక తల్లిదండ్రులకు కన్నీరు మిగిల్చింది.

Vikarabad District: ప్రతి తల్లిదండ్రులు  తమ బిడ్డలను బాగా చదివించాలనే భావిస్తుంటారు.  అలానే రవి అనే కార్మికుడు కూడా తమ బిడ్డను బాగా చదవించాలని రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ క్రమంలో సెలవుల్లో ఇంటికి వచ్చిన ఆ బాలిక తల్లిదండ్రులకు కన్నీరు మిగిల్చింది.

హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతున్నయువతి.. సెలవుల్లో ఇంటికి వచ్చి..!

ప్రతి ఒక్కరు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ముఖ్యంగా చాలా మంది యువతులు తమ కుటుంబ పరిస్థితిని చూసి.. బాగా చదువుకుని ఆర్థికంగా తోడుగా ఉండాలని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే రేయింబవళ్లు కష్టపడి చదువుతుంటారు. అలానే ఓ ఇంటర్ విద్యార్థిని కూడా బాగా చదువుకుని తన తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈక్రమంలోనే ఇంటర్ చదువుతోంది. ప్రస్తుతం సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆదివారం తల్లిదండ్రులను విషాదంలోకి నెట్టింది. మరి.. ఏం జరిగింది, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రతి తల్లిదండ్రులు  తమ బిడ్డలను బాగా చదివించాలనే భావిస్తుంటారు.  అలానే రవి అనే కార్మికుడు కూడా తమ బిడ్డను బాగా చదవించాలని రేయింబవళ్లు కష్టపడుతున్నారు. అయితే ఆయన ఆశలపై విధి నీళ్లు చల్లుతూ ఆదివారం ఘోర విషాదాన్ని నింపింది. కర్ణాటక రాష్ట్రం అల్లాకోట్ కు చెందిన ఎడెల్లి రవి, తన కుటుంబ సభ్యులతో కలిసి జీవనోపాధి కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలోని ఓగిపూర్ గ్రామంలో ఉంటున్నారు. ఆ గ్రామానికి సమీపంలోని నాపరాతి క్వారీల వద్ద నివాసముంటున్నారు రవి కుటుంబ సభ్యులు. అక్కడే నాపరాయి పాలిషింగ్ యూనిట్ లో కార్మికుడిగా పని చేస్తున్నారు.

ఇక రవికి పూజ(16) అనే కుమార్తె ఉంది. ఆ పాప ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. జినుగుర్తి సమీపంలోని ఓ హాస్టల్లో ఉంటూ పూజ ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇక సమ్మర్ హాలీడేస్ కావడంతో కొన్ని రోజుల నుంచి ఇంటి వద్దనే తల్లిదండ్రులతో పాటు ఉంటుంది. మరికొద్ది రోజుల్లో తిరిగి కాలేజీకి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి 1 గంట సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజ నిద్రిస్తుంది. అదే సమయంలో పాము రూపంలో మృత్యువు పూజను కాటేసింది. తల్లిదండ్రులతో నిద్రిస్తున్న పూజ కుడి కాలుపై పాము కాటేసింది. వెంటనే పూజ అరవడంతో ఆమె తల్లిదండ్రులు లేచి చూడగా పాము కనిపించింది.

దీంతో పాము కాటేసిందని నిర్ధాణకు వచ్చారు. వెంటనే పూజను తాండూరు జిల్లా ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పూజ పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు కర్ణాటక రాష్ట్రంలోని  బీదర్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పూజ  మృతి చెందింది. దీంతో పూజ కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. బాగా చదువుకుని ఉన్నత స్థితికి వెళ్తుందని అనుకుంటే ఇలా విగతజీవిగా కనిపించడంతో మృతురహాలి తల్లిదండ్రులు జీర్ణించుకోలేక ఉన్నారు. పూజ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి