iDreamPost
android-app
ios-app

పేద పిల్లల నడుమ పుట్టిన రోజు జరుపుకున్న మహేష్ బాబు కూతురు సితార

పేద పిల్లల నడుమ పుట్టిన రోజు జరుపుకున్న మహేష్ బాబు కూతురు సితార

నటుడు మహేష్ బాబు -నమ్రత దంపతుల గారాల పట్టి ప్రిన్స్ సితార రోజు రోజుకు ఎంతో ఫేమస్ అయిపోతోంది. ఇటీవలే సితార ఓ జ్యువెలరీ యాడ్ లో నటించి యాక్టింగ్ లో తండ్రికి ఏ మాత్రం తీసిపోనని చాటి చెప్పింది. ఇక దీంతో పాటు ఆ యాడ్ కు తీసుకున్న మొదటి రెమ్యూనరేషన్ ను చారిటీకి ఇచ్చి సేవ గుణంలో తండ్రిని మించిన తనయగా పేరు తెచ్చుకుంది. ఇక సితార చిన్న వయసులోనే ఇంత మంచి పని చేయడంతో ఆమెను పలువురు ప్రశంసలతో ముంచెత్తారు. ఇది మరువకముందే సితార మరోసారి సేవ గుణాన్ని చాటుకుంది. తన పుట్టిన రోజును పేద పిల్లల మధ్య జరుపుకుని వారికి ఎవరూ ఊహించిన సాయం చేసింది.

సితార తన 11వ పుట్టిన రోజు వేడుకులను చాలా స్పెషల్ గా జరుపుకుంది. ఎలాంటి హంగులు, ఆర్బాటాలు లేకుండా చాలా సాధారణంగా జరుపుకుంది. మహేష్ బాబు ఫౌండేషన్ లోని అమ్మాయిల మధ్య సితార తన పుట్టిన రోజు వేడుకులను ఘనంగా జరుపుకుంది. ఆ పేద పిల్లలతో ప్రేమగా మాట్లాడుతూ వారికి కేక్ తినిపించింది. దీంతో పాటు సితార మరోసారి తన మంచి మనసును చాటుకుంది. తన పుట్టిన రోజు సందర్భంగా ఆ పేద పిల్లలకు ఒక్కొక్కరికి బహుమతిగా సైకిళ్లను అందించింది. దీనికి సంబంధించిన వీడియోను మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఇప్పుడు ఈ పేద పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వారందరికీ స్కూల్ కేవలం సైకిల్ దూరంలో మాత్రమే ఉంది. నీలో ఇతరులపై చూపించే గొప్ప మనసు దాగి ఉంది. నీ అద్భుతమైన జీవితంలో ఇలాంటివి మరెన్నో అర్థవంతమైన జ్ఞాపకాలను రావాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్ డే సితార అంటూ నమ్రత రాసుకొచ్చారు.. ఈ వీడియోను చూసిన చాలా మంది పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

ఇది కూడా చదవండి: రేపు ఒక్కరోజే ఓటీటీలో 15 సినిమాలు స్ట్రీమింగ్.. ఆ మూడు మాత్రం..!

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisJojobetHoliganbetJojobet GirişJojobet - Güncel Giriş Adresi, Bonus ve Üyelik 2026