iDreamPost

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 22 వేల కోట్ల పెట్టుబడి.. 5 వేల ఉద్యోగాలకు SIPB ఆమోదం!

  • Published Jan 30, 2024 | 10:20 PMUpdated Jan 30, 2024 | 10:20 PM

Good News for the Unemployed: ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రపంచ దేశాల నుంచి రాష్ట్రంలోకి విస్తారంగా పెట్టుబడులు, పలు ప్రాజెక్టులు వచ్చేలా చేస్తు.. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు.

Good News for the Unemployed: ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రపంచ దేశాల నుంచి రాష్ట్రంలోకి విస్తారంగా పెట్టుబడులు, పలు ప్రాజెక్టులు వచ్చేలా చేస్తు.. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు.

  • Published Jan 30, 2024 | 10:20 PMUpdated Jan 30, 2024 | 10:20 PM
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 22 వేల కోట్ల పెట్టుబడి.. 5 వేల ఉద్యోగాలకు SIPB ఆమోదం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రాభివృద్ది కోసం ఎంతో కృషి చేస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. విద్య, వైద్య, రైతు, మహిళా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ది జరగాలంటే.. పరిశ్రమలు నెలకొల్పాలని ఉద్దేశంతో పలు దేశాలు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ కంపెనీలు రాష్ట్రంలో విస్తారంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో నిరుద్యోగ సమస్య చాలా వరకు తీరుతుందని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. వివరాల్లోకి వెళితే..

ఏపీలో నిరుద్యోగులకు సీఎం జగన్ మరో శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు పెట్టుబడి పెట్టేందుకు స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు(ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. మంగళవారం సాయంత్రం సీఎం జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో భేటీ సందర్భంగా ఎస్‌ఐపీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంధన రంగంలో రూ.22,302 కోట్లు, ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగవకాశాలు కల్పించేందుకు అమోదం తెలిపినట్లు తెలుస్తుంది. వైఎస్సార్ జిల్లా చక్రాయపేట వద్ద 400 మెగావాట్లు, సత్యసాయి జిల్లా ముదిగుబ్బ వద్ద 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనగానపల్లె, రాప్తాడులో 1050 మెగావాట్లు, అనంత పురం జిల్లాలో డి హిరేలాల్, బొమ్మన హాల్ 850 మెగా వాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటు చేసుందుకు సిద్దమైతున్నట్లు తెలుస్తుంది. మొత్తం 3350 మెగా వాట్ల సోలార్ ప్రాజెక్టులను.. దాదాపు రూ.12,065 కోట్ల పెట్టుబడితో జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ నిర్మించేందుకు సిద్దమైతునట్లు తెలుస్తుంది. ఈ ప్లాంట్ల ఏర్పాటు వల్ల సుమారు 3300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగవకాశాలు లభించే అవకాశం ఉంది.

రూ.4 వేల కోట్ల ఖర్చుతో అగ్వా గ్రీన్ ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్ల పల్లలో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు వెయ్యి మందికి ఉద్యోగవకాశాలు రానున్నాయి. రూ.1287 కోట్ల పెట్టుబడితో సుమారు 171.60 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ కంపెనీ నంద్యాల జిల్లాలో అవుకు మండలం కునుకుంట్ల, కర్నూల్ జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం వద్ద రెండు విండ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల ప్రత్యక్షంగా రెండ వందల మందికి ఉద్యోగవకాశాలు లభించే అవకాశం ఉంది. కర్నూల్ జిల్లాలో ఆస్పరి వద్ద రెండు వందల మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు ను ఎక్రోన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్మించ తలపెట్టినట్లు తెలుస్తుంది. ఇందుకోసం రూ.1350కోట్లు ఖర్చు చేయనుంది.. ఈ ప్రాజెక్ట్ ద్వారా రెండు వందల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది రెన్యూ విక్రం శక్తి ప్రైవేట్ లిమిటెడ్. దీని కోసం రూ. రూ.3,600 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 600 మంది ఉద్యోగాలు దక్కున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి