iDreamPost

Singareni Election: సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఎప్పుడంటే?

ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. త్వరలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. త్వరలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Singareni Election: సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఎప్పుడంటే?

తెలంగాణలో వరుస ఎన్నికగా ఎన్నికల సందడి నెలకొంటుంది. మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పట్టణాలు, గ్రామాలు ప్రచారాలతో హూరెత్తిపోయాయి. నవంబర్ 30 న పోలింగ్ జరిగింది.  డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.. దశాబ్ద కాలం పాలించిన బీఆర్ఎస్ ని గద్దెదించింది కాంగ్రెస్ పార్టీ. డిసెంబర్ 7న తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.  ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష నేతలు మరోసారి యుద్దానికి సిద్దమవుతున్నారు. ఇదిలా ఉంటే.. సింగరేణి ఎన్నికలకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

సింగరేణి ఎన్నికలకు తాజాగా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని మధ్యంతర పిటీషన్ ని కొట్టివేస్తూ.. డిసెంబర్ 27న ఎన్నికలు జరుపుకునేందుకు వీలు కల్పించింది హైకోర్టు. ఇటీవల సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పిటీషన్ ని ఈ రోజు విచారించి ఎన్నికలు జరుపుకోవచ్చని తెలిపింది. ఎప్పుడో జరగాల్సిన సింగరేణి ఎన్నికలు పలు కారణాల వల్ల వాయిదాలు పడుతూ వస్తుంది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితితో పాటు ఎన్నికల నిర్వహణపై నాలుగేళ్లుగా హైకోర్టులో వివాదం నడుస్తుంది.

ఈ వ్యవహారం పై యాజమాన్యం, ప్రభుత్వం, కార్మిక సంఘాలు ఎప్పటికప్పుడు హైకోర్టును ఆశ్రయిస్తూనే ఉన్నాయి. ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన ఎన్నికలను కోర్టు జోక్యంతో అక్టోబర్ 30న నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు కార్మిక శాఖ సైతం ఎన్నికలకు సిద్దమైంది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. ఈ క్రమంలోనే నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగింది.. కొన్ని కార్మిక సంఘాలు మరోసారి సింగరేణి యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని.. నామినేషన్లు, ఉపసంహరణ విషయంలో ఆశ్రయించాయి. ఇంతలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. దీంతో సింగరేణి ఎన్నిక వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో తాజాగా హైకోర్టు డిసెంబర్ 27 న మళ్లీ ఎన్నికల నిర్వహించాలని హైకోర్టు ఫుల్ బేంచ్ సూచించింది. ఈ క్రమంలోనే ఆర్ఎల్సీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి సింగరేణి ఎన్నికల ప్రక్రియ పునఃప్రారంభించారు. సింగరేణి ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు కార్మికులు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేశాయి కార్మిక సంఘాలు.  ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి