iDreamPost

సిల్వర్ బంగారమైపోతోంది.. త్వరలోనే లక్ష దాటుతుందా?.. బంగారం ధరలు కూడా పైపైకి

బంగారం, వెండి ధరలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. అంతకంతకు పెరుగుతూ పసిడి ప్రియులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇక బంగారంతో పాటు వెండి కూడా చేతికి అందకుండా పరుగులు తీస్తోంది.

బంగారం, వెండి ధరలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. అంతకంతకు పెరుగుతూ పసిడి ప్రియులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇక బంగారంతో పాటు వెండి కూడా చేతికి అందకుండా పరుగులు తీస్తోంది.

సిల్వర్ బంగారమైపోతోంది.. త్వరలోనే లక్ష దాటుతుందా?.. బంగారం ధరలు కూడా పైపైకి

భారతీయులకు బంగారంపై ఎంత మక్కువ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. పసిడిని ఆభరణాలుగానే చూడకుండా పెట్టుబడి మార్గంగా భావిస్తుంటారు. గోల్డ్ తమ వద్ద ఉన్నట్లైతే ఆపద సమయంలో ఆదుకుంటుందని విశ్వసిస్తూ ఉంటారు. ఎందుకంటే భవిష్యత్తులో బంగారం ధరలు పెరగనుండడంతో పుత్తడిపై ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు అందుకోవచ్చు. ఇక ఇటీవల దేశ వ్యాప్తంగా జోరుగా పెళ్లిల్లు, శుభకార్యాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగారానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక ఇప్పుడు బంగారమే కాదు సిల్వర్ కూడా పసిడి కంటే శరవేగంగా పరుగులు తీస్తోంది. కిలో వెండి త్వరలోనే లక్ష రూపాయలు దాటుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇటీవల కాలంలో బంగారం ధరలు పెరగడమే తప్పా తగ్గడం లేదు. దీంతో పసిడి ప్రియులు గోల్డ్ కొనేందుకు ఓ క్షణం ఆలోచించాల్సిన పరిస్థితి దాపరించింది. సిల్వర్ కూడా అదే స్థాయిలో వినియోగదారులకు షాకిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకున్న ఒడిదుడుకులు బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. అంతే కాదు డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవడం, దేశాల మధ్య యుద్ద ప్రభావాలు వంటి ఇతర కారణాలు గోల్డ్, సిల్వర్ ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. పెరుగుతున్నధరలు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇక నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Gold And Silver

నేడు తులం బంగారంపై రూ. 10 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నేడు పెరిగిన ధరలతో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,320 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,210 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,320 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 67,210 గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,320 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 67,210 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 73,320 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 67,210 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇక వెండి బంగారాన్ని దాటి పరుగులు తీస్తోంది. ఊహించని రీతిలో సిల్వర్ ధరలు పెరిగి కస్టమర్లకు షాకిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి సిల్వర్ ధరలు చేరుకున్నాయి. నేడు కేజి వెండి ధర రూ. 100 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 90వేల మార్క్ దాటి రూ. 90,100 కు చేరింది. విజయవాడలో కూడా రూ. 90,100 వద్ద సిల్వర్ ట్రేడ్ అవుతోంది. చెన్నై రూ. 90,100కి చేరింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతుండడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఇక భవిష్యత్తులో తమకు బంగారం, వెండి అందని ద్రాక్షేనా అంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి