iDreamPost

IND vs ENG: మెక్ కల్లమ్ రాత్రి మాకు ఒకే మాట చెప్పాడు.. దాంతోనే ఇండియాను ఓడిస్తాం: అండర్సన్

రెండో టెస్ట్ లో తమ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ చెప్పిన ఒకే ఒక్క మాటతో ఇండియాను ఓడిస్తామని ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఇంతకీ వాళ్ల కోచ్ ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.

రెండో టెస్ట్ లో తమ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ చెప్పిన ఒకే ఒక్క మాటతో ఇండియాను ఓడిస్తామని ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఇంతకీ వాళ్ల కోచ్ ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.

IND vs ENG: మెక్ కల్లమ్ రాత్రి మాకు ఒకే మాట చెప్పాడు.. దాంతోనే ఇండియాను ఓడిస్తాం: అండర్సన్

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా మారింది. వికెట్లు తీయాలని టీమిండియా, పరుగులు రాబట్టాలని ఇంగ్లాండ్ జట్లు ఆరాటపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ ప్రేక్షకులకు ఫుల్ మజాను పంచడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంగ్లీష్ జట్టు విజయానికి ఇంకా 332 పరుగులు అవసరం కాగా.. చేతిలో ఇంకా తొమ్మిది వికెట్లు ఉన్నాయి. అయితే టీమిండియా బౌలర్లు ఉన్న స్వింగ్ లో జట్టు విజయం సాధించడం పెద్ద విషయమేమీ కాదు. ఇదిలా ఉండగా.. మూడోరోజు ఆటముగిసిన తర్వాత షాకింగ్ కామెంట్స్ చేశాడు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జేమ్స్ అండర్సన్. రాత్రి కోచ్ మెక్ కల్లమ్ మాకు ఒకే ఒక్క మాట చెప్పాడు.. ఆ మాటతోనే ఇండియాను ఓడిస్తామని ప్రగల్భాలు పలికాడు.

విశాఖపట్నం వేదికగా జరుగుతున్న టెస్ట్ ఉత్కంఠంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కేవలం 255 పరుగులకే ఆలౌట్ కావడంతో.. 399 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా విఫలం అవుతూ.. విమర్శల పాలవుతున్న శుబ్ మన్ గిల్ వీరోచిత శతకంతో మెరిశాడు. ఈ సెంచరీతో తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చాడు. అతడు 147 బంతులు ఎదుర్కకొని 11 ఫోర్లు 2 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఒక్కరు కూడా అర్ధశతకం సాధించలేకపోయారు. అక్షర్ పటేల్ 45 పరుగులతో ఓ మోస్తారుగా రాణించాడు.

399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మూడో రోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజ్ లో జాక్ క్రాలీ(29), రెహన్ అహ్మద్(9) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మ్యాచ్ అనంతరం అండర్సన్ మాట్లాడుతూ..”టీమ్ మెుత్తానికి కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ రాత్రి ఒకే మాట చెప్పారు. ఒకవేళ టీమిండియా మన ముందు 600 లక్ష్యం ఉంచినా.. దాన్ని ఛేజ్ చేయాలి. కోచ్ చెప్పిన మాటతోనే మేము ముందుకుసాగుతాం. ఈ క్రమంలో మేం ఓడినా.. గెలిచినా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోము. ఇక ఈ మ్యాచ్ లో 5 వికెట్లు తీయడం సంతోషంగా ఉంది. పైగా 35 ఓవర్లు బౌలింగ్ వేయడంతో.. నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నానో తెలియజెప్పాను” అంటూ చెప్పుకొచ్చాడు అండర్సన్.

అయితే ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో.. ఫలితం కచ్చితంగా తేలనుంది. కాగా.. ఈ మ్యాచ్ ను 60 నుంచి 70 ఓవర్లలో ముగించేందుకు చూస్తున్నామని అండర్సన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఇక అండర్సన్ వ్యాఖ్యలపై ఇండియన్ క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్ల ప్రదర్శన చూసి కూడా ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నావ్? అంటూ కౌంటర్స్ ఇస్తున్నారు. మరి అండర్సన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IND vs ENG: గిల్ అరుదైన ఘనత.. సచిన్, కోహ్లీ సరసన చోటు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి