iDreamPost
android-app
ios-app

Shubman Gill: ఇంజక్షన్లు తీసుకొని ఆడా.. సంచలన నిజాలు వెల్లడించిన గిల్!

  • Published Feb 06, 2024 | 7:47 AM Updated Updated Feb 06, 2024 | 7:47 AM

అద్భుత శతకంతో ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టాడు శుబ్ మన్ గిల్. అయితే తాను బ్యాటింగ్ కు దిగే ముందు ఇంజక్షన్లు తీసుకుని మరీ వచ్చానని సంచలన నిజాలు వెల్లడించాడు. మరి గిల్ ఇంజక్షన్లు ఎందుకు తీసుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

అద్భుత శతకంతో ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టాడు శుబ్ మన్ గిల్. అయితే తాను బ్యాటింగ్ కు దిగే ముందు ఇంజక్షన్లు తీసుకుని మరీ వచ్చానని సంచలన నిజాలు వెల్లడించాడు. మరి గిల్ ఇంజక్షన్లు ఎందుకు తీసుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

Shubman Gill: ఇంజక్షన్లు తీసుకొని ఆడా.. సంచలన నిజాలు వెల్లడించిన గిల్!

విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో 106 పరుగుల తేడాతో విజయం సాధించి.. తొలి టెస్ట్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. ఇక ఈ విజయంతో ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. కీలకమైన ఈ పోరులో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు యువ బ్యాటర్ శుబ్ మన్ గిల్. గత కొంతకాలంగా తన ఫామ్ పై వస్తున్న తీవ్ర విమర్శలకు ఈ శతకంతో కౌంటర్ ఇచ్చాడు. అయితే మ్యాచ్ అనంతరం గిల్ సంచలన నిజాలు వెల్లడించాడు. తాను బ్యాటింగ్ కు దిగే ముందు ఇంజక్షన్లు తీసుకుని ఆడానని షాకింగ్ న్యూస్ చెప్పాడు. మరి గిల్ ఎందుకు ఇంజక్షన్లు తీసుకున్నాడు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

శుబ్ మన్ గిల్.. టీమిండియాలో అతి తక్కువ కాలంలో కీ ప్లేయర్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే గత కొన్ని మ్యాచ్ ల నుంచి దారుణంగా విఫలం అవుతూ వస్తున్నాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలతో పాటుగా ఒత్తిడి ఏర్పడింది. పైగా విశాఖ మ్యాచే అతడికి ఆఖరి ఛాన్స్ గా టీమిండియా మేనేజ్ మెంట్ సైతం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఒత్తిడిని అధిగమించి.. అద్భుతమైన శతకంతో తన ప్లేస్ ను పదిలం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో 147 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 104 పరుగులు చేసి జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించాడు. ఇదిలా ఉండగా.. మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత మాట్లాడిన గిల్ సంచలన నిజాలు వెల్లడించాడు.

Sensational truth revealed Gill!

శుబ్ మన్ గిల్ మాట్లాడుతూ..”నేను సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగే ముందు ఇంజక్షన్లు తీసుకుని వచ్చాను. ఎందుకంటే? ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు నా వేలికి గాయమైంది. దాంతో నేను బ్యాటింగ్ కు దిగుతానో? లేదో? అని అందరూ భయపడ్డారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో జట్టుకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఇంజక్షన్లు తీసుకుని మరీ బ్యాటింగ్ కు దిగాను. ఆ బాధతోనే సెంచరీ చేశాను” అంటూ షాకింగ్ విషయాలు వెల్లడించాడు ఈ యువ బ్యాటర్. ఇక ఈ విషయం తెలిసిన క్రికెట్ ఫ్యాన్స్ గిల్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. నీ సాహసానికి సెల్యూట్ అంటూ కితాబిస్తున్నారు. ఇక మూడో టెస్ట్ రాజ్ కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుంది. మరి టీమ్ కోసం ఇంజక్షన్లు వేసుకుని మరీ బ్యాటింగ్ చేసిన గిల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన రోహిత్.. ఆ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్​గా రికార్డు!