iDreamPost
android-app
ios-app

కోహ్లీ-రోహిత్‌ శర్మ మైండ్‌సెట్‌ గురించి గిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Published Nov 03, 2023 | 1:55 PMUpdated Nov 03, 2023 | 1:55 PM

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌.. తాను టీమిండియాకు రెండు కళ్లలాంటి ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీ నుంచి తాను నేర్చుకున్న విషయాలు ఇవే అంటూ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌.. తాను టీమిండియాకు రెండు కళ్లలాంటి ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీ నుంచి తాను నేర్చుకున్న విషయాలు ఇవే అంటూ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 03, 2023 | 1:55 PMUpdated Nov 03, 2023 | 1:55 PM
కోహ్లీ-రోహిత్‌ శర్మ మైండ్‌సెట్‌ గురించి గిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

టీమిండియా యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ తిరిగి తన ఫామ్‌ను అందుకున్నాడు. శ్రీలంకపై అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి 92 పరుగులతో సత్తా చాటాడు. కొద్దిలో సెంచరీ మిస్‌ అయినా.. గిల్‌ ఆడిన ఇన్నింగ్స్‌ జట్టుకు అవసరమైన సమయంలో వచ్చింది. కాగా, ఈ వరల్డ్‌ కప్‌ ఆరంభానికి ముందు డెంగ్యూతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైనా.. తిరిగి జట్టులోకి వచ్చి ఈ మ్యాచ్‌తో తన పూర్వ ఫామ్‌ను అందుకున్నట్లు కనిపించాడు. ఈ మ్యాచ్‌ కంటే ముందు ఓ హాఫ్‌ సెంచరీ చేసినా.. గిల్‌ పూర్తిగా టచ్‌లో కనిపించలేదు. వరల్డ్‌ కప్‌ ప్రారంభానికి ముందు భీకర ఫామ్‌లో ఉన్న గిల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, అనారోగ్యంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కావడం, జ్వరంతో బరువుతగ్గి ఫిట్‌నెస్‌ కాస్త కోల్పోవడం అతని ఆటపై ప్రభావం చూపింది.

కానీ, లంకపై గిల్‌ ఆడిన తీరు చూస్తుంటే.. వరల్డ్‌ కప్‌కి ముందు ఉన్న గిల్‌ మల్లీ తిరిగొచ్చినట్లు ఉన్నాడు. అతను ఆడిన షాట్లు కానీ, చూపించిన ఇంటెంట్‌ కానీ సూపర్‌. ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అవుటైన తర్వాత. సీనియర్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీతో కలిసి గిల్‌ నెలకొల్పిన భారీ భాగస్వామ్యం టీమిండియాను మ్యాచ్‌లో పైస్థాయిలో నిలబెట్టింది. కోహ్లీ-గిల్‌ సెట్‌ చేసిన ప్లాట్‌ఫామ్‌పై శ్రేయస్‌ అయ్యర్‌ చెలరేగిపోయాడు. దీంతో టీమిండియా 357 పరుగుల భారీ స్కోర్‌ను లంక ముందు ఇచ్చింది. ఆ స్కోర్‌ చూసే సగం చచ్చిన లంక.. నిప్పులు చెరుగుతున్న టీమిండియా బౌలింగ్‌ ముందు విలవిల్లాడిపోయింది. కేవలం 55 పరుగులకే కుప్పకూలి చిత్తుచిత్తుగా ఓడింది.

ఇక చాలా కాలం తర్వాత ఈ మ్యాచ్‌లో మంచి టచ్‌లోకి వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌.. కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ప్రస్తుతం టీమిండియా రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ సీనియర్‌ ఆటగాళ్లు. జట్టులోని చాలా మంది యువ క్రికెటర్లును వీళ్లిద్దరూ ముందుండి నడిపిస్తున్నారు. పైగా ఇద్దరూ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. ఇప్పుడు గిల్‌ సైతం ఫామ్‌లోకి రావడంతో టీమిండియా టాపార్డర్‌ దుర్భేద్యంగా మారింది. అయితే.. రోహిత్‌-కోహ్లీ నుంచి తాను నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన విషయాల గురించి, బ్యాటింగ్‌ సమయంలో వాళ్లిద్దరు ఏ మైండ్‌సెట్‌తో ఉంటారు అనే విషయాల గురించి గిల్‌ వెల్లడించాడు.

రోహిత్‌ శర్మ.. తన జోన్‌లో బాల్‌ పడితే వదలడని, అంతకంటే ముందు 10 బంతుల్లో చాలా సిక్సులు వచ్చినా, బీట్‌ అయినా, బౌలింగ్‌ అద్భుతంగా వేస్తున్నా పట్టించుకోడని, తన జోన్‌లో బాల్‌ పడితే మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న పెద్ద షాట్‌ ఆడతాడని అది రోహిత్‌ నుంచి నేర్చుకున్నట్లు తెలిపాడు. ఇక కోహ్లీ.. సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ.. మన టీమ్‌పై ఏ మాత్రం ఒత్తిడి లేకుండా చేస్తాడని, మధ్య మధ్యలో బౌండరీ వస్తే పరుగులు ఆపలేక ప్రత్యర్థి జట్టు ఒత్తిడిలో ఉంటుందని కోహ్లీ నమ్ముతాడని కోహ్లీ నుంచి నేను అది నేర్చుకున్నట్లు తెలిపాడు గిల్‌. ఇలా ఇద్దరు స్టార్‌ ఆటగాళ్ల నుంచి గిల్‌ తాను నేర్చుకున్న విషయాలను వెల్లడించాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి