SNP
SNP
క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన హైఓల్టేజ్ మ్యాచ్ అయిన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ మొదలైపోయింది. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మెగా మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. యువ స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఎట్టకేలకు బరిలోకి దిగాడు. వరల్డ్ కప్ కంటే ముందు భీకర ఫామ్‌లో ఉన్న గిల్.. దురదృష్టవశాత్తు.. వరల్డ్ కప్ ప్రారంభమైన తర్వాత డెంగ్యూ బారిన పడ్డాడు.
దీంతో చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో, అలాగే ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోను గిల్ ఆడలేకపోయాడు. డెంగ్యూ నుంచి కోలుకుని.. ఎట్టకేలకు ఎంతో ప్రతిష్టాత్మక ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు శుబ్‌మన్ బరిలోకి దిగాడు. యువ క్రికెటర్ అయిన గిల్‌కు ఇదే తొలి వరల్డ్ కప్ అనే విషయం తెలిసిందే. వరల్డ్ కప్‌కి ముందు గిల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. 2003 వన్డే వరల్డ్ కప్‌లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 673 పరుగులు రికార్డును ఈ వరల్డ్ కప్‌లో గిల్ బ్రేక్ చేసే అవకాశం ఉందని చాలా మంది క్రికెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే గిల్ అలాంటి ఫామ్‌లో ఉన్నాడు.
కానీ, దురదృష్టవశాత్తు అతను డెంగ్యూ బారిన పడి.. తొలి రెండు మ్యాచ్‌లకు ఆడలేకపోయాడు. అయితే.. వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ.. అద్భుత ప్రదర్శన కనబర్చి.. దేశాన్ని గెలిపించాలని ప్రతి క్రికెటర్ అనుకుంటాడు. గిల్ కూడా అలానే వరల్డ్ కప్ కోసం సిద్ధం అయ్యాడు. కానీ, అనారోగ్యం అతని ఆశలపై ఆరంభంలో నీళ్లు చల్లింది. అయినా నిరాశ చెందకుండా.. డెంగ్యూ నుంచి వేగంగా కోలుకున్నాడు. నిజానికి డెంగ్యూ నుంచి అంత త్వరగా కోలుకోవడం అంత సులువైన విషయం కాదు. జ్వరం తగ్గినా కీళ్ల నొప్పులు ఉంటాయి. వాటిని లెక్కచేయకుండా ఫిట్‌నెస్ సాధించి, పాకిస్థాన్‌పై ఆడాలనే పట్టుదలతో గిల్ బరిలోకి దిగాడు. దేశం తరఫున ఆడాలని ఇంత మొండిపట్టుదలతో బరిలోకి దిగిన గిల్‌కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. గిల్ లాంటి యువ క్రికెటర్‌లో ఇంత తెగువ, కమిట్‌మెంట్ చూస్తుంటే.. టీమిండియా భవిష్యత్తు ఇంకా అద్భుతంగా ఉంటుందని అనుకోవచ్చు. మరి డెంగ్యూ నుంచి కోలుకుని, మరింత రెస్ట్ తీసుకోకుండా.. పాక్‌పై బరిలోకి దిగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#INDvsPAK
Stage is all set for biggest rivalry btw #IndiaVsPakistan
electrifying atmosphere in #Ahmedabad #ViratKohli #RohithSharma #subhmangill #BabarAzam
Let’s go 🇮🇳 #BleedBlue pic.twitter.com/wFBDHPCAJI— Rahul Arya (@rahularya0707) October 14, 2023
ఇదీ చదవండి: