క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ జాతర మెుదలైంది. అట్టహాసంగా ప్రారంభమైన వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ను కుంగుతినిపించింది న్యూజిలాండ్. గతేడాది వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది కివీస్. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ తొలి మ్యాచ్ కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ బ్యాటర్ డెంగ్యూ బారిన పడ్డాడు. దీంతో అతడు ఆసీస్ తో ఆదివారం జరిగే మ్యాచ్ కు ఆడటం అనుమానంగా మారింది.
వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం(అక్టోబర్ 8)న ఆసీస్ తో తన తొలి మ్యాచ్ ఆడబోతోంది టీమిండియా. ఈ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత జట్టుకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. టీమిండియా యువ ఓపెనర్, స్టార్ బ్యాటర్ శుబ్ మన్ గిల్ డెంగ్యూ బారిన పడ్డాడు. దీంతో అతడు ఆసీస్ తో మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడా? లేడా? అన్నది అనుమానంగా మారింది. అయితే ఈరోజు(శుక్రవారం) మరోసారి టెస్ట్ చేసి మేనేజ్ మెంట్ తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ఒకవేళ గిల్ అందుబాటులో లేకపోతే.. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ ను తుది జట్టులోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఆసీస్ లాంటి పటిష్ట జట్టుతో మ్యాచ్ కు ముందు ఇది టీమిండియాకు భారీ షాకనే చెప్పాలి. ఈ విషయం తెలిసిన అభిమానులు గిల్ త్వరగా రికవరీ కావాలని ప్రార్థిస్తున్నారు.
🚨 REPORTS 🚨
Shubman Gill has tested positive for dengue and is a major doubt for the game against Australia on Sunday.
The team management will take a call on Gill’s availability after another round of tests on Friday.
Wishing Shubman Gill a very quick recovery 💪#INDvAUS… pic.twitter.com/12qNUnPiGj
— Sportskeeda (@Sportskeeda) October 6, 2023