iDreamPost

శుబ్ మన్ గిల్ కు అరుదైన గౌరవం.. ‘స్టేట్ ఐకాన్’గా!

Shubman Gill: టీమిండియా యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. స్టేట్ ఐకాన్ గా నియమించబడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Shubman Gill: టీమిండియా యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. స్టేట్ ఐకాన్ గా నియమించబడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

శుబ్ మన్ గిల్ కు అరుదైన గౌరవం.. ‘స్టేట్ ఐకాన్’గా!

టీమిండియా యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్ తన ఆటతీరుతో జట్టులో తన ప్లేస్ ను సుస్థిరం చేసుకున్నాడు. అయితే గత కొంత కాలంగా పూర్ ఫామ్ లో ఉన్న గిల్.. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో సెంచరీతో సత్తాచాటాడు. దీంతో తిరిగి ఫామ్ లోకి వచ్చి.. తనపై వచ్చిన విమర్శలకు ధీటైన ఆన్సర్ ఇచ్చాడు. ఇక మూడో టెస్ట్ లో మాత్రం అనుకున్నంతగా రాణించలేకపోయాడు. ఇదిలా ఉండగా.. తాజాగా గిల్ కు ఓ అరుదైన గౌరవం దక్కింది. స్టేట్ ఐకాన్ గా గిల్ నియమితుడైయ్యాడు.

శుబ్ మన్ గిల్ కు అరుదైన గౌరవం దక్కింది. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల కోసం పంజాబ్ రాష్ట్రానికి ‘స్టేట్ ఐకాన్’గా నియమించబడ్డాడు. గిల్ ను స్టేట్ ఐకాన్ గా నియమిస్తున్నట్లు ఆ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సీబిన్ సి ప్రకటించారు.ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో 70 శాతం ఓటింగ్ నమోదు అయ్యేలా, ఓటర్లలో అవగాహన కలిగించే పలు కార్యక్రమాల్లో గిల్ పాల్గొంటాడు. ఈ క్రమంలోనే పంజాబ్ ఇస్ వార్ 70 పార్ అనే నినాదంతో ఈ ఎన్నికల్లో ముందుకెళ్తోంది పంజాబ్ పోల్ ప్యానల్. గిల్ లాంటి ప్రముఖులతో ఎన్నికల్లో ఓటింగ్ పెంచే కార్యక్రమాలను నిర్వహించనుంది.

ఇదిలా ఉండగా.. 2019 లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ లోని 13 స్థానాలకు ఎన్నికలు జరగగా.. 65.96 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి 70 శాతానికి పైగా ఓటింగ్ పెంచాలని ముందుకెళ్తోంది. ఇదిలా ఉండగా.. ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్ట్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో 91 పరుగులు చేసి.. దురదృష్టవశాత్తు రనౌట్ గా వెనుదిరిగాడు. అయితే గత కొన్ని మ్యాచ్ ల్లో పరుగులు చేయడానికి ఇబ్బందులు పడి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న గిల్ తాజాగా సెంచరీతో ఫామ్ లోకి వచ్చాడు. మరి స్టేట్ ఐకాన్ గా గిల్ నియమించబడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొన్న ట్రక్కు.. నలుగురు యువ క్రికెటర్లు మృతి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి