iDreamPost

ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొన్న ట్రక్కు.. నలుగురు యువ క్రికెటర్లు మృతి!

టీమిండియాకు ఆడాలని ఆ యువ క్రికెటర్లు ఎన్నో కలలు కన్నారు. కానీ వారి కలలను మృత్యువు చిదిమేసింది. ఘోర యాక్సిడెంట్ కారణంగా నలుగురు యంగ్ ప్లేయర్లు కన్నుమూశారు.

టీమిండియాకు ఆడాలని ఆ యువ క్రికెటర్లు ఎన్నో కలలు కన్నారు. కానీ వారి కలలను మృత్యువు చిదిమేసింది. ఘోర యాక్సిడెంట్ కారణంగా నలుగురు యంగ్ ప్లేయర్లు కన్నుమూశారు.

ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొన్న ట్రక్కు.. నలుగురు యువ క్రికెటర్లు మృతి!

భారతదేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ క్రేజ్ ను చూసిన కుర్రాళ్లు అంతా దాదాపుగా క్రికెటర్లు కావాలని కలలు కంటూ ఉంటారు. తమ కల కోసం ఎన్నికష్టాలనైనా ఎదుర్కొంటూ ముందుకుసాగుతుంటారు. అలా ముందుకుసాగుతున్న ఓ నలుగురు యువ క్రికెటర్లను మృత్యువు కబళించింది. క్రికెట్ టోర్నమెంట్ కు వెళ్తున్న ఆటగాళ్ల మినీబస్సును ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు యువ ఆటగాళ్లు మరణించారు.

టీమిండియాకు ఆడాలని ఆ యువ క్రికెటర్లు ఎన్నో కలలు కన్నారు. కానీ వారి ఆశలను మృత్యువు చిదిమేసింది. ఈ విషాద సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. నంద్ గావ్ తహసీల్ లోని శింగనాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా యావత్మాల్ లో నిర్వహిస్తున్న ఓ క్రికెట్ టోర్నమెంట్ కు యువ క్రికెటర్లు అంతా మినీబస్సులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో కాంక్రీట్ మిక్సర్ తీసుకెళ్తున్న ట్రక్కు బస్సును ఢీకొన్నది. ఈ ఘటనలో నలుగురు యంగ్ క్రికెటర్లు మరణించగా.. మరో ఐదురుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

దీంతో క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. మరణించిన యువకులు అమరావతి నగరానికి చెందిన రీహరి రౌత్, జయూశ్ బహాలే, సుయాశ్ అంబర్డే, సందేశ్ పదార్ గా గుర్తించారు. ఇక ఈ ప్రమాదంలో మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే నిర్లక్ష్యమే ఈ యాక్సిడెంట్ కు కారణమని ప్రాథమికంగా తేల్చారు. స్థానికంగా ఈ ఘటన విషాదాన్ని నింపింది.

ఇదికూడా చదవండి: మిడిల్‌ ఫింగర్‌ చూపిస్తూ కేన్‌ మామ.. ఆలస్యంగా వీడియో లీక్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి