iDreamPost

Shubman Gill: రోహిత్ శర్మను ఇన్ స్టాగ్రామ్ లో నిజంగానే అన్ ఫాలో చేశాడా? క్లారిటీ ఇచ్చిన గిల్!

శుబ్ మన్ గిల్ ఇన్ స్టాగ్రామ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అన్ ఫాలో చేసినట్లు వార్తలు వైరల్ గా మారాయి. ఈ న్యూస్ క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ వివాదంపై గిల్ క్లారిటీ ఇచ్చాడు.

శుబ్ మన్ గిల్ ఇన్ స్టాగ్రామ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అన్ ఫాలో చేసినట్లు వార్తలు వైరల్ గా మారాయి. ఈ న్యూస్ క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ వివాదంపై గిల్ క్లారిటీ ఇచ్చాడు.

Shubman Gill: రోహిత్ శర్మను ఇన్ స్టాగ్రామ్ లో నిజంగానే అన్ ఫాలో చేశాడా? క్లారిటీ ఇచ్చిన గిల్!

టీమిండియా యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్ ను క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అమెరికా నుంచి ఇండియాకు పంపించింది బీసీసీఐ. అయితే భారత్ కు చేరుకున్న వెంటనే గిల్ ఇన్ స్టాగ్రామ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అన్ ఫాలో చేసినట్లు వార్తలు వైరల్ గా మారాయి. ఈ న్యూస్ క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ వివాదంపై గిల్ క్లారిటీ ఇచ్చాడు. మరి నిజంగానే రోహిత్ ను గిల్ అన్ ఫాలో చేశాడా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శుబ్ మన్ గిల్.. టీమిండియాలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే కీలక ప్లేయర్ గా గుర్తింపు పొందాడు. తన ఆటతీరుతో జట్టులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే గత కొంతకాలంగా తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు ఈ యంగ్ ప్లేయర్. తాజాగా మరో వివాదంతో న్యూస్ లోకి ఎక్కాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో ట్రావెల్ రిజర్వ్ డ్ ప్లేయర్ గా ఎంపికైయ్యాడు. ఇతడితో పాటుగా ఆవేశ్ ఖాన్,  రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ లు కూడా సెలెక్ట్ అయ్యారు.

Gill clarity on Insta Story

అయితే.. టీమిండియాతో పాటుగా అమెరికా వెళ్లిన గిల్ జట్టుతో ఉండకుండా.. తన వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటూ ఉంటున్నాడన్న కారణాలతో అతడిని తిరిగి ఇండియాకు పంపించింది. అయితే ఇండియాకు రాగానే కెప్టెన్ రోహిత్ శర్మను ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేశాడని, టీమిండియా స్వ్కాడ్ నుంచి తొలగించినందుకే గిల్ ఇలా చేశాడని ఊహాగానాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై గిల్ క్లారిటీ ఇచ్చాడు. రోహిత్ శర్మతో కలిసి ఉన్న ఫొటోను తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. ఈ ఒక్క ఫొటోతో తనకూ రోహిత్ కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పక్కనే చెప్పాడు. తాను రోహిత్ శర్మ వెంటే ఉన్నానని, అతడి నుంచి క్రమశిక్షణ నేర్చుకుంటున్నానని తెలిపాడు. ఒక్క పోస్ట్ తో తాను రోహిత్ ను ఇన్ స్టా నుంచి అన్ ఫాలో చేయలేదని అందరికీ తెలియజేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Ꮪhubman Gill (@shubmangill)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి