ఎంతో మంది స్టార్ ప్లేయర్లను కాదని ప్రెస్టీజియస్ అవార్డును దక్కించుకున్నాడు శుబ్ మన్ గిల్. మరి గిల్ సాధించిన ఆ అవార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎంతో మంది స్టార్ ప్లేయర్లను కాదని ప్రెస్టీజియస్ అవార్డును దక్కించుకున్నాడు శుబ్ మన్ గిల్. మరి గిల్ సాధించిన ఆ అవార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.
శుబ్ మన్ గిల్.. టీమిండియా యువ సంచలనం. జట్టులోకి వచ్చిన అతి కొద్దికాలంలోనే అద్భుతమైన ఆటతీరుతో తన స్థానాన్ని సుస్థిర పరుచుకున్నాడు. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న యంగ్ ప్లేయర్లకు స్పూర్తిగా నిలుస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా జరిగిన వరల్డ్ కప్ లో కూడా తనదైన ఆటతీరుతో మెప్పించాడు. ఈ మెగాటోర్నీలో 354 పరుగలు చేశాడు. ఇక తన ఆటతో ఇప్పటికే పలు ఘనతలు సాధించిన గిల్.. తాజాగా మరో అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు. ఎంతో మంది స్టార్ ప్లేయర్లను కాదని ఈ ప్రెస్టీజియస్ అవార్డును దక్కించుకున్నాడు. మరి గిల్ సాధించిన ఆ అవార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.
2019లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు శుబ్ మన్ గిల్. ఆ ఏడాది జనవరిలో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్ లోకి రంగప్రవేశం చేశాడు. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు ఈ యువ బ్యాటర్. రోహిత్ తో ఇన్నింగ్స్ ను ఓపెన్ చేస్తూ.. తనదైన ఆటతీరుతో రాణిస్తున్నాడు. ఇక 24 సంవత్సరాలకే వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీనితో పాటు 2023 సెప్టెంబర్ నెలకు గాను ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికైయ్యాడు. తాజాగా మరో ఘనత సాధించాడు గిల్.
CNBC-TV18 సంస్థ తాజాగా 19వ ఎడిషన్ కు సంబంధించి ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ ను ప్రకటించింది. ఈ అవార్డుల్లో భాగంగా శుబ్ మన్ గిల్ కు “స్పోర్ట్స్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు” ప్రకటించింది. డిసెంబర్ 2న ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో గిల్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నాడు. కాగా.. 24 ఏళ్ల వయసులోనే పలు ప్రతిష్టాత్మక ఘనతలు అందుకుంటున్న శుబ్ మన్ గిల్ మరో అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మరి గిల్ కు ఈ అవార్డు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.