iDreamPost
android-app
ios-app

అఫ్రిదీని టార్గెట్‌ చేసిన టీమిండియా ఓపెనర్లు! చెప్పి మరీ..

  • Published Sep 10, 2023 | 4:11 PMUpdated Sep 10, 2023 | 4:11 PM
  • Published Sep 10, 2023 | 4:11 PMUpdated Sep 10, 2023 | 4:11 PM
అఫ్రిదీని టార్గెట్‌ చేసిన టీమిండియా ఓపెనర్లు! చెప్పి మరీ..

ఆసియా కప్‌ 2023లో భాగంగా కొలంబో వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియన్‌ ఓపెనర్లు రోహిత్‌ శర్మ-శుబ్‌మన్‌ గిల్‌ దుమ్మురేపుతున్నారు. పేస్‌ బౌలింగే బలమనుకునే పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్నారు. పాక్‌ ప్రధాన బౌలర్‌ షాహీన్‌ షా అఫ్రిదీని అయితే అ‍త్యంత దారుణంగా టార్గెట్‌ చేసి మరీ కొడుతున్నారు. మ్యాచ్‌ ప్రారంభమైన తొలి ఓవర్‌లోనే రోహిత్‌ వర్మ భారీ సిక్స్‌తో ఫస్ట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత శుబ్‌గిల్‌ అయితే.. అఫ్రిదీని పిచ్చికొట్టుడు కొట్టాడు.

ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌, తన రెండో ఓవర్‌ వేసేందుకు వచ్చిన అఫ్రిదీకి చుక్కలు చూపించాడు. తొలి రెండు బంతులో రెండు అద్భుతమైన ఫోర్లు కొట్టాడు. అలాగే ఐదో బంతికి కూడా మరో ఫోర్‌ బాదాడు. ఆ ఓవర్‌లో మొత్తం 12 పరుగులు రాబట్టాడు. స్పెల్‌ కొనసాగిస్తూ.. మరోసారి ఇన్నింగ్స్‌ 5వ ఓవర్‌ తన మూడో వేసేందుకు వచ్చిన అఫ్రిదీకి గిల్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చాడు. మళ్లీ మూడు ఫోర్లతో అల్లాడించాడు. గిల్‌ కొడుతున్న షాట్లకు కాస్త ఒత్తిడికి గురైన అఫ్రిదీ.. తొలి బంతిని వైడ్‌గా వేశాడు. రెండో బంతిని గిల్‌ ఫోర్‌ బాదాడు. అలాగే ఓవర్‌ చివరి రెండు బంతుల్లోనూ రెండు ఫోర్లు బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తం 13 పరుగులు వచ్చాయి.

ఇలా మొత్తం అఫ్రిదీ వేసిన 3 ఓవర్లలోనే 31 పరుగులు సమర్పించుకున్నాడు. సాహజంగా 10, 8 ఓవర్ల వరకు 4, 5 ఓవర్ల స్పెల్‌ వేసే అఫ్రిదీ.. గిల్‌ కొట్టుడికి మూడు ఓవర్ల తర్వాత బౌలింగ్‌ ఆపేశాడు. కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌.. అతని స్థానంలో కొత్త బౌలర్‌ను తెచ్చాడు. అయినా కూడా భారత బ్యాటర్లు బాదడం ఆపలేదు. టీమిండియా ఓపెనర్ల బ్యాటింగ్‌ చేస్తే.. షాహీన్‌ అఫ్రిదీని టార్గెట్‌ చేసి మరీ కొట్టినట్లు కనిపించింది. కాగా, లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ అయిన షాహీన్‌ షా అఫ్రిదీని ఎదుర్కొవడంలో టీమిండియా టాపార్డర్‌ బ్యాటర్ల ఇబ్బంది పడుతున్నారనే విమర్శ ఉంది. ఆ ముద్రను చెరిపేసేందుకే అఫ్రిదీని టీమిండియా ఓపెనర్లు టార్గెట్‌ చేసినట్లు తెలుస్తుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs PAK: టీమిండియాకు షాహిన్ అఫ్రిది వార్నింగ్! ఇది ఆరంభం మాత్రమే అంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి