iDreamPost
android-app
ios-app

వీడియో: రష్మికను చూసి కూడా పట్టించుకోని స్టార్‌ హీరోయిన్‌!

  • Published Sep 20, 2023 | 6:19 PM Updated Updated Sep 20, 2023 | 6:19 PM
  • Published Sep 20, 2023 | 6:19 PMUpdated Sep 20, 2023 | 6:19 PM
వీడియో: రష్మికను చూసి కూడా పట్టించుకోని స్టార్‌ హీరోయిన్‌!

ప్రపంచ కుభేరుడు ముఖేష్‌ అంబానీ ఇంట్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా ఆయన తన ఇంట్లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. క్రికెటర్లు కేఎల్‌​ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, హార్థిక్‌ పాండ్యా, కృణాల్‌ పాండ్యా నేషనల్‌తో పాటు నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న కూడా అంబానీ ఇంటికి వినాయక చవితి కార్యక్రమం కోసం వెళ్లారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.

పాపరజీలు రష్మికను ఆపి ఫొటోలు తీస్తూ ఉండగా.. అటు వైపు స్టార్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌ వచ్చారు. ఆమె రష్మికను చూశారు. అయినా పలకరించకుండా.. రష్మిక వైపు తిరిగి చూడకుండానే అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆమె అలా వెళ్లిపోతూ ఉండగా రష్మిక చూశారు. ఓ చిరు నవ్వు నవ్వుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న రష్మిక ఫ్యాన్స్‌.. ‘‘రష్మిక క్రేజ్‌ చూసి శ్రద్ధా కపూర్‌ జలసీగా ఫీలవుతున్నారు’’..‘‘ నేషనల్‌ క్రష్‌ను చూసి ఎవరైనా కుళ్లుకోవాల్సిందే’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా, వినాయ చవితిని పురస్కరించుకుని ముఖేష్‌ అంబానీ, ఆయన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ  లాల్‌బగీచా రాజాను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం లాల్‌బగీచా రాజాకు అదిరిపోయే బహుమతి ఇచ్చారు. 2 వేల నోట్ల రూపాయలతో తయారు చేసిన పెద్ద దండను వినాయకుడికి సమర్పించారు. ఇక, ఆ 2 వేల నోట్ల రూపాయల దండ ఫొటోలు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, రష్మిక మందన్నను చూసి కూడా శ్రద్ధా కపూర్‌ పలకరించకపోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetgrandpashabetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş