iDreamPost

ఆ విషయాల్లో ధోని, విరాట్ కోహ్లీలు ఒక్కటే.. ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోని మధ్య కొన్ని విషయాల్లో పోలికలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు టీమిండియా వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్. మరి ఇద్దరి మధ్య ఉన్న ఆ పోలికలు ఏంటో.. ఇప్పుడు చూద్దాం.

విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోని మధ్య కొన్ని విషయాల్లో పోలికలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు టీమిండియా వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్. మరి ఇద్దరి మధ్య ఉన్న ఆ పోలికలు ఏంటో.. ఇప్పుడు చూద్దాం.

ఆ విషయాల్లో ధోని, విరాట్ కోహ్లీలు ఒక్కటే.. ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మహేంద్రసింగ్ ధోని.. ప్రపంచంలోని అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్ గా టీమిండియా క్రికెట్ పైనే కాకుండా.. వరల్డ్ క్రికెట్ పై తనదైన ముద్రవేశాడు. మరోవైపు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సైతం బ్యాటింగ్, కెప్టెన్ గా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వీరిద్దరి మధ్య కొన్ని విషయాల్లో దగ్గరి పోలికలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు టీమిండియా వెటరన్ ప్లేయర్ శిఖర్ ధావన్. మరి ఆ విషయాలు ఏంటి? తెలుసుకుందాం పదండి.

సాధారణంగా ఏ రంగంలోనైనా ఇద్దరి వ్యక్తుల మధ్య పోలికలు ఉండటం అనేది కామనే. ఇలాంటి కామన్ పోలికలే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీల మధ్య ఉన్నాయని చెప్పుకొచ్చాడు వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ..”ధోని భాయ్ లో విరాట్ కోహ్లీలో సంకల్పం, విల్ పవర్ తో పాటుగా ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి. వీరిద్దరిలో ఈ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. మరీ ముఖ్యంగా టీమ్ కష్టాల్లో ఉన్న సమయాల్లో వీరు తీసుకునే నిర్ణయాలు జట్టును విజయతీరాలకు చేర్చుతాయి. ఇలా ఒక్కటేంటి.. చాలా విషయాల్లో ఇద్దరి మధ్య పోలికలు ఉన్నాయి” అని చెప్పుకొచ్చాడు శిఖర్ ధావన్.

కాగా.. శిఖర్ ధావన్ గత కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఫ్యామిలీ సమస్యలతో సతమతమవుతున్న ధావన్ కొన్ని రోజుల క్రితమే డొమెస్టిక్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. డీవై పాటిల్ కప్ లో డివై పాటిల్ బ్లూ టీమ్ కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఓ మ్యాచ్ లో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లాంగ్ గ్యాప్ తర్వాత టచ్ లోకి వచ్చిన ధావన్ ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. మరి నిజంగానే ధావన్ అన్నట్లుగా ధోని-విరాట్ మధ్య ఆ విషయాల్లో పోలికలు ఉన్నాయా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: నన్ను అపార్థం చేసుకోకండి.. IPL ఆడకపోవడానికి కారణమిదే! హ్యారీ బ్రూక్ ఎమోషనల్..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి